ఆ సినిమా కోసం మనోజ్ 10 కిలోల బరువు తగ్గాడట !

మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమైన మంచు మనోజ్ అనుకున్నంతగా రాణించలేక పోయాడు.ఒకటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన మళ్ళీ వరస ప్లాపులతో రేస్ లో వెనుక పడ్డాడు.

 Manchu Manoj 10 Kg Weight Loss For Aham Brahmasmi Movie, Manchu Manoj, Stunning-TeluguStop.com

ఇంత వరకు మనోజ్ కమర్షియల్ హీరోగా మాత్రం అవ్వలేకపోయాడు.కానీ ఈయన రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా పేరుతెచ్చుకున్నాడు.

ప్రజలకు చేతనైన సహాయం చేస్తూ వారి గుండెల్లో అభిమానం సంపాదించుకున్నాడు.

అయితే మనోజ్ చాలా రోజులుగా సినిమాలు చేయడం లేదు.

ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.ఇక సినిమాలు చేయడు అనుకుంటున్నా సమయంలో అహం బ్రహ్మాస్మి సినిమాను ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

సినిమా ప్రకటించిన రోజే ఫస్ట్ లుక్ కూడా ప్రకటించడంతో ఒక్కసారికి అంచనాలు పెంచాడు.

Telugu Aham Brahmasmi, Manchu Manoj, Manchumanoj, Makeover-Movie

ఈ సినిమాను మార్చి లోనే స్టార్ట్ చేయాలనీ భావించిన కరోనా కారణంగా వాయిదా వేశారు.ఇప్పుడు పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడుతున్న సమయంలో మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అలా స్టార్ట్ అయితే మనోజ్ కూడా తన సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా చేస్తుండడంతో ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో మనోజ్ ఉన్నాడు.

Telugu Aham Brahmasmi, Manchu Manoj, Manchumanoj, Makeover-Movie

అందుకే ఈ సినిమా కోసం తన లుక్ తో పాటు బాడీలో కూడా మార్పులు చేసుకుంటున్నట్టు సమాచారం.ఇప్పుడు కరోనా కారణంగా వచ్చిన విరామం ను ఉపయోగించుకుని చాలా బరువు తగ్గాడని వార్తలు వస్తున్నాయి.కష్టమైన కసరత్తులు చేస్తూ తన ఫిజిక్ మొత్తం మార్చేస్తున్నాడని టాక్.

అంతేకాదు దాదాపు 10 కిలోల బరువు కూడా తగ్గాడట.చూడాలి మరి ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడతాడో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube