భజరంగి భాయ్ జాన్ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

2015 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి విడుదలైన భజరంగీ భాయిజాన్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 Watch Munni Bajrangi Bharijaan Aka Harshali Malhotra Officially Teenager Now, Ba-TeluguStop.com

ఈ సినిమాలో మున్నీ పాత్ర చేసిన చిన్నారిని ఎవరూ అంత తేలికగా మరిచిపోలేరు.సినిమాలో క్యూట్ గా, అమాయకంగా కనిపించిన ఈ చిన్నారి ఐదేళ్లలో పూర్తిగా మారిపోయారు.

సినిమాలో మున్నీ పాత్ర పోషించిన ఈ చిన్నారి పేరు హర్షలి మల్హోత్ర కాగా ఈ చిన్నారి ఇప్పుడు టీనేజర్ గా మారిపోయారు.హర్షలి తాజాగా 13వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హర్షలీ మల్హోత్రా తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తాను ఇప్పుడు టీనేజర్ నని పేర్కొన్నారు.బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేసిన వాళ్లందరికీ హర్షలీ కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టినరోజు ఫోటోలలో హర్షలీని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.హర్షలీ చాలా ఎదిగిపోయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అయితే హర్షలి ఎదిగినా ఆమె చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మరోవైపు హర్షలి తన సోషల్ మీడియా ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

హర్షలికి సోషల్ మీడియా ఖాతాలలో ఏకంగా 10 లక్షల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.మరోవైపు హర్షలి తరచూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు.

ఆ వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.చిన్నప్పటికీ ఇప్పటికీ హర్షలి పూర్తిగా మారిపోయారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube