రూ. కోటి చెల్లించి భారతీయుడిని ఉరి శిక్ష నుంచి తప్పించిన భారత ఎన్నారై

యూఏఈ లో ఊహించని విధంగా జైలు పాలయిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది అక్కడి సుప్రీంకోర్టు.త్వరలో అతడికి మరణ శిక్ష అమలు చేయనున్న తరుణంలో భాదితులకు రూ.కోటి చెల్లిస్తే మరణ శిక్ష నుంచీ తప్పించుకునే అవకాశం వచ్చింది.అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బు వారి వద్దలేదు, పైగా మద్యరతగతి వ్యక్తులు ప్రాణాలు కాపాడుకోవాలంటే డబ్బు కట్టాల్సిన పరిస్థితి.ఈ క్రమంలోనే కొందరి సూచన మేరకు మరణ శిక్ష పడిన భారత వ్యక్తి బెక్స్ కుటుంభం భారత సంతతికి చెందిన యూఏఈ లో బడా వ్యాపారవేత్తగా స్థిరపడిన లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీని కలిసి పరిస్థితిని వివరించింది.

 Lulu Group Chairman Yusuf Ali Pays 1 Crore To Save Indian Expat On Death Row, Lu-TeluguStop.com

2012 లో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత వ్యక్తి నడిపే ట్యాక్సీ కింద పడి ఓ బాలుడు చనిపోయాడు.దాంతో అతడికి అక్కడి న్యాయస్థానం విచారణ జరిపిన తరువాత ఉరి శిక్ష ఖరారు చేసింది.అయితే మృతుడి తల్లి తండ్రులు భారత వ్యక్తికీ క్షమాభిక్ష కు అంగీకరించడంతో రూ.కోటి భాదిత కుటుంభానికి చెల్లించమని కోర్టు తీర్పు చెప్పిందని యూసఫ్ అలీ దృష్టికి తమ పరిస్థితిని విన్నవించారు.నిత్యం ప్రవాస భారతీయులకు ఏదో ఒక రూపంలో సాయం చేసే యూసఫ్ అలీ భారత వ్యక్తిని విడిపించేందుకు రూ.కోటి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.దాంతో సదరు వ్యక్తి విడుదలకు మార్గం సుగమమమయినట్టేనని తెలుస్తోంది.

Telugu Crore, Row, Indian, Kerala, Luluchairman-Telugu NRI

యూసఫ్ అలీ మరణ శిక్ష పడిన బెక్స్ కుటుంభాన్ని చూసి చేలించిపోయారు.భాదితులు సూడాన్ వెళ్ళారని తెలుసుకుని వారితో అలీ నేరుగా మాట్లాడారు.ఉరి శిక్ష పడకుండా చూడాలంటే నిర్ణయం మీదేనని చెప్తూనే వారిని క్షమాభిక్ష కు ఒప్పించారు యూసఫ్ అలీ.ఇప్పటికే బెక్స్ విడుదలకు అంతా సిద్దమయ్యిందని యూఏఈ లో ఉన్న భారత ఎంబసీ తెలిపింది.అంతేకాదు తను విడుదల అవుతున్నాడనే విషయాన్ని, యూసఫ్ అలీ చేసిన సాయాన్ని బెక్స్ కు వివరించారు అధికారులు.అయితే తనకు చివరి కోరిక ఉందని, విడుదల అయిన తరువాత యూసఫ్ అలీ ని కలిసే అవకాశం ఇవ్వండని బెక్స్ కోరాడట.

బెక్స్ విషయంలో యూసఫ్ అలీ చేసిన ప్రయత్నానికి ఆయన ఉదారా గుణానికి కృతజ్ఞతలు తెలిపాయి యూఏఈ లోని ఎన్నారై సంస్థలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube