పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల..!! 

అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్.తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తనని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అనేక ఇబ్బందుల పాలు చేయడం జరిగిందని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయటం కుట్ర అని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పదవి నుండి తొలగించటం జరిగిందని పేర్కొన్నారు.

 Eetela Rajendar Resign To Trs Party And Mla Post, Eetela Rajendar, Huzurbaad,-TeluguStop.com

కనీసం వివరణ ఇవ్వలేదు ఎవరో అనామకుడు లెటర్ రాస్తే దానిని పరిగణలోకి తీసుకుని ఇష్టానుసారం అయిన చర్యలు తీసుకున్నారని టిఆర్ఎస్ పార్టీపై ఈటెల మండిపడ్డారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎవరు ఎన్ని మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీని బలపరిచింది మాత్రం తానే అని పేర్కొన్నారు.

అటువంటి నియోజకవర్గంలో ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు తనతో కలసి పని చేసిన నాయకులకు డబ్బులు ఆశలు చూపి ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురి చేశారు అని తెలిపారు.అయితే ఇన్ని కుట్రలు తనపై జరుగుతున్న తనకి నియోజకవర్గ ప్రజల అండ ఉందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ కాదు బానిస భవన్ సీఎంవో లో ఎస్సీ, ఎస్టీ, బిసి ఐఏఎస్ అధికారి ఎవరైనా ఉన్నార అదే దీనికి నిదర్శనం అంటూ ఈటల విమర్శల వర్షం కురిపించా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube