కరోనాకి సిద్ధ వైద్యం.. కోలుకున్న 100 మంది.. ఎక్కడో తెలుసా..!

ఓ పక్క అల్లోపతిలో కరోనాని నియంత్రించేందుకు డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క ఆయుర్వేదం, సిద్ధ వైద్యంతో కూడా కరోనాని అరికట్టవచ్చని కొందరు నిరూపిస్తున్నారు.ఇప్పటికే కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే.

 Siddha Vaidhyam For 100 Covid Patients Tamilnadu State, 100 Covid Patients Coron-TeluguStop.com

కృష్ణపట్నంలో అందరు ఆనందయ్య మందుని నమ్ముతున్నారు.ఇక కొత్తగా తమిళనాడులో సిద్ధ వైద్యంతో కరోనాని తగ్గిస్తున్నారని తెలుస్తుంది.

స్థానిక మీనంబాక్కంలో ప్రైవేట్ కాలేజ్ గ్రౌండ్లో సిద్ధ వైద్య ప్రత్యేక చికిత్స కేంద్ర ఏర్పాటు చేశారు.అక్కడ ట్రీట్ మెంట్ పొందిన వందమంది కరోనా బాధితులు సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మీనంబాక్కంలో ఏ.ఎం.జైన్ కళాశాలలో మే 11న సిద్ధ వైద్య చికిత్సకేంద్రం సిఎం ఎం.కే స్టాలిన్ ప్రారంభించారు.ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఇక్కడ సిద్ధ వైద్య కేంద్రం.కరోనా బాధితుల పడకలు సదుపాయాలు ఏర్పాటు చేశారు.తక్కువస్థాయిలో కొవిడ్ లక్షణాలు ఉన్న వారు.శ్వసకోశ సంబంధిత సమస్యలు లేని కరోనా బాహితులకు చికిత్స అందించారు.రాష్ట్ర సిద్ధ వైద్య సమన్వయ కర్త డాక్టర్ శశికుమర్, భారతీయ వైధ్య శాఖ సంచాలకులు గణేష్ గారి సలహాల మేరకు వీరికి ట్రీట్ మెంట్ చేసినట్టు సిద్ధ వైద్య కేంద్ర నిర్వాహకులు చెప్పారు.

కొద్దిపాటి లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు ఈ సిద్ధ వైద్యం ఎంతో ఉపయోగకరగా ఉంటుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube