ఇండియాలో ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఒకటి.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.
మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అమెజాన్ దీనికి సీక్వెల్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది.ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా కీలక పాత్రలో నటించింది.
అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 4న స్ట్రీమింగ్ అవ్వబోతుందని ఎప్పుడో ప్రకటించారు.చెప్పినట్టుగానే ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ లో 12 కన్నా ముందే స్ట్రీమింగ్ కు వచ్చింది.
కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ఎంతో ఆశతో ఓపెన్ చేసిన తెలుగు ఆడియెన్స్ ను డిజప్పాయింట్ చేసింది.
ఈ వెబ్ సిరీస్ హిందీ తో పాటు తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతోందని ముందు నుండి చెబుతున్నారు.కానీ ఇప్పుడు ఒక్క హిందీ భాషలో మాత్రమే విడుదల అయ్యింది.దీంతో ఈ వెబ్ సిరీస్ పై ఆశ పెట్టుకున్న తెలుగు అభిమానులు నిరాశ చెందారు.ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తెలుగు వెర్షన్ వచ్చే వారం రాబోతుందని టాక్ నడుస్తుంది.
మరి చూడాలి ఈ వెబ్ సిరీస్ ఎంత మేరకు మెప్పిస్తుందో.