లాక్‌డౌన్‌ను పుష్ప కోసం పూర్తిగా వాడేస్తున్న నటుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

 Fahadh Fasil Uses Lockdown For Pushpa, Fahadh Fasil, Pushpa, Allu Arjun, Sukumar-TeluguStop.com

ఇక ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో ముఖ్యంగా విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వనున్నాడు.తెలుగులో ఆయన నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం.మలయాళంలో సూపర్ ఫాంలో ఉన్న హీరోగా ఫాహద్‌కు అదిరిపోయే క్రేజ్ ఉంది.ఇక ఓటీటీల పుణ్యమా అని ఫాహద్ నటించిన సినిమాలు యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

దీంతో పుష్పలో ఫాహద్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది.అయితే పుష్ప చిత్ర షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్ సమయాన్ని ఫాహద్ పూర్తిగా పుష్ప చిత్రం కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు.అందుకోసం ఇప్పుడాయన చిత్తూరు యాసను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడా లేక వేరేవారితో చెప్పిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇక ఈ సినిమాలో ఆయన లుక్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా పుష్ప చిత్రం కోసం ఫాహద్ డెడికేషన్ చూసి అప్పుడే చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube