అఖిల్ 'ఏజెంట్' సినిమాలో సీనియర్ స్టార్ ఉపేంద్ర..!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.ఈయన కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

 Upendra In Akhil Surender Reddy Agent Movie, Upendra, Akhil, Surender Reddy, Age-TeluguStop.com

నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్ అవుతున్నాయని క్రిటిక్స్ అభిప్రాయం.

ప్రస్తుతం అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

Telugu Akhil, Surender Reddy, Upendra, Upendraakhil-Movie

ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అఖిల్ లోని మాస్ హీరోను బయటకు తీసి ప్రేక్షకులకు కొత్తగా చూపించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ లో అఖిల్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Telugu Akhil, Surender Reddy, Upendra, Upendraakhil-Movie

ఈ మధ్య సినిమాల్లో సీనియర్ హీరోలు ఎక్కువుగా కనిపిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో కూడా ఒక సీనియర్ హీరో నటించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో ఉపేంద్ర తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి పాజిటివ్ టాక్ అందుకున్నాడు.

అయితే ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే సురేందర్ రెడ్డి ఉపేంద్రతో చర్చలు కూడా జరుపు తున్నదని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube