కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.
కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని కరోనా కేసుల గురించి తెలుసుకోవడానికో లేదా కరోనా రాకుండా ఏం చేయాలని సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు.కొన్ని వీడియోలను చూసి భయపడిపోతుంటారు.
ఇంకొన్ని వీడియోలను చూసి ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు.అయితే మానసిక నిపుణులు మాత్రం ఓ విషయం చెబుతున్నారు.
తమకు ఉల్లాసాన్ని కలిగించే వీడియోలను, ఆనందాన్ని కలిగించే వీడియోలను చూడాలని చెబుతున్నారు.ఇలాంటి వీడియోనే తాజాగా ఒకటి వైరల్ అవుతోంది.
కోతి ఎప్పుడూ ఒక్క చోట కుదురుగా ఉండదు.అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు ఎప్పుడూ పరుగులు, గెంతులు వేస్తూనే ఉంటుంది.
చెట్టు చిటారు కొమ్మల నుంచి కూడా ఎంత దూరమైనా ఎగిరే శక్తి సామర్థ్యాలు కోతి సొంతం.అయితే, పాపం ఇక్కడో కోతి మాత్రం దాని లెక్క తప్పింది.
ఫలితంగా బొక్కబోర్లా పడింది.ఓ కోతి రోడ్డుకు అవతలి వైపు ఉన్న చెట్టు మీదకు దూకేందుకు ప్రయత్నించింది.
అంచనా తప్పు కావడంతో అంత ఎత్తు నుంచి దూకి రోడ్డు మీద బోర్లా పడింది.పాపం దెబ్బలు గట్టిగా తగిలాయో ఏమిటో కదల్లేక ఇబ్బంది పడింది.
కాసేపు కప్పలా అలాగే భూమికి అత్తుకుపోయింది.చివరికి ఎలాగోలా తేరుకుని పైకి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కోతిని చూసిన నెటిజన్లు జాలిపడుతూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా ఇటువంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.వీటిని చూడటం వల్ల కొందరికి మానసిక ఉల్లాసం కూడా పొందే అవకాశం ఉంది.