అలాంటే వాడే నా మొగుడు కావాలి.. దివి కామెంట్స్ వైరల్..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 ఆ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్లకు బాగా కలిసొస్తుంది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్లకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

 Divi Tells About She Wants To Marry This Type Of Person, Divi Future,  Husband ,-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి వాద్యా హౌస్ లో తక్కువ వారాలే ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపును సంపాదించుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి సైతం తను నటిస్తున్న వేదాళం సినిమాలో దివికి ఛాన్స్ ఇచ్చారు.

మరోవైపు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ జాబితాలో దివి వాద్యా నంబర్ 1 స్థానంలో నిలిచి పాపులారిటీని మరింత పెంచుకున్నారు.గతంలో ఒకబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయితో విడిపోయిన దివి వాద్యా తాజగా వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ తనకు కాబోయే మొగుడికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.కానిసం 6.3 అడుగుల ఉన్న వ్యక్తే తనకు భర్తగా రావాలని దివి వాద్యా పేర్కొన్నారు.

Telugu Divi, Type Person-Movie

తన హైట్ 5.8 కాబట్టి తనకు ఎక్కువ ఎత్తు ఉన్న భర్త కావాలని దివి తెలిపారు.తనకు కాబోయే వ్యక్తి కష్టపడే పని చేసే వ్యక్తి అయ్యి ఉండాలని ఆమె పేర్కొన్నారు.తనకు కాబోయే వ్యక్తి తెలివైన వ్యక్తి అయ్యి ఉండాలని దివి తెలిపారు.

కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి తనకు కావాలని ఆమె వెల్లడించారు.అమ్మాయికి ఇంతకు మించి లక్షణాలు ఉన్న భర్త అవసరం లేదని దివి వాద్యా పేర్కొన్నారు.

Telugu Divi, Type Person-Movie

మరి దివి వాద్యా కోరుకున్న లక్షణాలతో ఉన్న భర్త ఆమెకు దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది.తనకు కాబోయే వ్యక్తి తనను బాగా చూసుకోవాలని దివి వాద్యా వెల్లడించారు.బిగ్ బాస్ 4 ద్వారా ఓ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న దివి వాద్యా భవిష్యత్తులో మరిన్ని అఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube