వైరల్: ఇంట్లో వేలాడుతున్న పాములు.. అయినా అద్దె కట్టలేదని..?!

మనం ఏదైనా ఇంట్లో రెంట్ కి ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్, లేదా ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి.అలాంటి సమయాల్లో ఆ ఇంటి యజమానితో సమస్య గురించి చెప్పి.

 Viral House Owner Demands Rent While Snakes In The House In Georgia , Snakes, Ho-TeluguStop.com

బాగుచేయించుకుంటాం.ఎప్పుడైనా మనం అద్దె కట్టకపోతే వారు మన సమస్యలను తీర్చడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.

తాజాగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబానికి ఆ ఇంటి యజమాని షాకిచ్చాడు.ఇంట్లో పాములు ఉన్నాయని, ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలని ఆ కుటుంబ సభ్యులు ఇంటి ఓనర్ ని అడిగారు.

మీరు ముందు అద్దె డబ్బులు ఇవ్వండి.అప్పుడు మీ సమస్య గురించి ఆలోచిస్తా అని ఆ యజమాని చెప్పడంతో వారు షాకయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

జార్జియా దేశంలోని టిబిలిసిలోహ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

అక్కడ ఇటీవల భారీ వర్షం కురిసింది.ఆ వర్షానికి వారు ఉంటున్న ఆ ఇంటి పైకప్పు పెచ్చులూడిపోయాయి.అవి మీద పడిపోతాయేమోనని వారు భయపడేవారు.అప్పటికే కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపడ్డాయి.

ఇక్కడ వాళ్ళకొచ్చిన మరో ఇబ్బంది ఏమిటంటే.అక్కడ పెచ్చులు ఊడిపోయిన ప్రాంతం నుంచి పాములు బయటపడుతున్నాయి.

ఇంట్లో ఎక్కడ చూసినా పాములు వేలాడుతూ ఉండటంతో వారు తెగ భయపడిపోయారు.

Telugu Georgia, Harry, Latest-Latest News - Telugu

ఆ ఇంట్లో సీలింగ్ లో ఉన్న ఎలుకలను తినడం కోసం ఆ పాములు వచ్చాయి.హ్యారీ దంపతులు ఆ పాములను చూసి ఏం చేయాలా అని ఆలోచించారు.ఈ విషయాన్ని ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి చెప్పాడు.

ఇంట్లో ఉన్న పాములను వెంటనే అక్కడి నుంచి తీయించాలని కోరాడు.దానికి ఆ యజమాని.

మీరు గత 2 నెలలుగా ఇంటి రెంట్ కట్టడం లేదు.ముందు ఇంటి రెంట్ కట్టండి.

ఆ తర్వాత పాములను తీయించేస్తాను అంటూ బదులిచ్చింది.దీంతో షాకైన హ్యారీ కుటుంబ సభ్యులు ఆ పాములు ఉన్న ఇంట్లోనే క్షణక్షణం భయపడుతూ రెండు రోజుల పాటు అలానే గడిపినట్లు అతడు ఆ దేశంలోని ఓ మీడియా సంస్థకు చెప్పాడు.

సాధారణంగా పాములను చూస్తేనే మనం తెగ భయపడిపోతాం.అలాంటిది పాములతో కలిసి ఓ ఇంట్లో ఉండాలంటే అది ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube