తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు..!!

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై హైకోర్టుకు నివేదిక అందించడం జరిగింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

 Ts High Court Serious On Telangana Government, High Court, Telangana Government,-TeluguStop.com

గతంలో తాము సూచించిన ఆదేశాలను ఏదీ కూడా పాటించలేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సీరియస్ అయింది.ఈ క్రమంలో విచారణకు ఉన్నత అధికారులు హాజరు కావాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ముఖ్యంగా కరోనా చికిత్స విషయంలో కొత్త జీవో ఇవ్వకపోవడం, కరోనా పై సలహా కమిటీ  ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ క్రమంలో ఈ నివేదికపై హెల్త్ సెక్రటరీ, డి హెచ్, డిజిపి వివరణ ఇవ్వాలని తెలిపింది.

పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర లో దాదాపు 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకింది.దీంతో పిల్లల విషయంలో ప్రభుత్వం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అన్న దానిపై హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది.

 గతంలో హైకోర్టు సూచించిన విషయాలలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని .న్యాయస్థానం విమర్శలు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube