వైరల్ వీడియో: హైన ఎరను ఎత్తుకెళ్లిన చిరుత.. చివరికి..?!

టెక్నాలజీ పెరుగుతోంది.సాంకేతికత ప్రపంచ దిశ దశను మారుస్తోంది.యువత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది.స్మార్ట్ ఫోన్ల విప్లవంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తోంది యువత.ఇక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏమిజరుగుతోందో తెలుసుకుంటోంది.దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని ఏమూలనున్న వారినైనా సోషల్ మీడియా ద్వారా పలకరిస్తోంది.

 Viral Video Cheetah Theft Hyenas Meal Strategically , Viral Video, Viral News, V-TeluguStop.com

అంతలా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది.మితిమీరిపోతున్న సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడిన యూత్ దాంట్లోనే కాలక్షేపం చేసేస్తున్నారు.

అసలే కరోనా టైం.ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు.ఇటువంటి సమయంలో చాలా మంది సోషల్ మీడియాలో వివిధ రకాల వైరల్ వీడియోలను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు.అయితే సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయ్యింది.అడవిలో మింగేసేలా మీదికొచ్చిన ఓ హైనా పంజా నుంచి చిరుత పులి చాకచక్యంగా బయటపడింది.

చిన్న గాయం కూడా కాకుండా శత్రువు నుంచి తప్పించుకుంది.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అడవిలో హాయిగా తిరుగుతున్న ఓ హైనా ఎక్కడ్నుంచో ఆహారం సంపాదించి తెచ్చుకుంది.అయితే, హైనా ఆహారాన్ని ఎప్పుడు, ఎక్కడ చూసిందో తెలియదు గానీ ఓ చిరుతపులి హైనా తెచ్చిపెట్టుకున్న ఆహారాన్ని ఎత్తుకెళ్లింది.

అది చూసిన హైనాకు చిర్రెత్తిపోయింది.చిరుత పీక కొరికేయాలన్నంత స్పీడ్‌గా మీదకు రాబోయింది.

అయితే చిరుత తన వేగంతో హైనా ఆహారాన్ని పట్టుకుని ఒక్క జంప్ చేసి చెట్టు ఎక్కి అక్కడే తిష్ట వేసింది.హమ్మయ్య అనుకుని చెట్టుపైన సేఫ్‌గా కూర్చుంది.కొందరికి ఈ వీడియో తెగ నవ్వును తెప్పిస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.కుర్రకారు ఇలాంటి వీడియోను చూస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేసేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube