ఈ గోదావరి బ్యూటీ మీకు ఇంకా గుర్తుందా...?

చలన చిత్ర పరిశ్రమలో మొదటగా తెలుగు భాషలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుని ఆ తరువాత మంచి క్రేజ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెళ్లి కెరియర్ ని పోగొట్టుకున్న హీరో,హీరోయిన్లు ఎందరో ఉన్నారు.అయితే ఇందులో 2003వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు “సాజి కైలాష్” దర్శకత్వం వహించిన “విష్ణు” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ముంబై బ్యూటీ “నీతూ చంద్ర” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Tollywood Actress Neetu Chandra Movie Offers And Real Life News, Telugu Actress,-TeluguStop.com

అయితే విష్ణు చిత్రంలో నటించిన తర్వాత నీతూ చంద్ర ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “గోదావరి” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.

దీంతో మళ్లీ బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నించి బాగానే సక్సెస్ అయ్యింది.

Telugu Neetu Chandra, Godavari, Hollywood, Offers, Rajasekhar, Revolt, Telugu Ac

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.దీంతో బాలీవుడ్ లో కూడా నీతూ చంద్ర అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.కాగా తెలుగులో ఆమధ్య హీరో రాజశేఖర్ నటించిన హీరోగా నటించిన “సత్యమేవ జయతే” చిత్రంలో నటించినప్పటికీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

Telugu Neetu Chandra, Godavari, Hollywood, Offers, Rajasekhar, Revolt, Telugu Ac

అయితే తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటించి తన అందాల ఆరబోతతో ఓ మోస్తరు సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ నిలకడలేమి కారణంగా ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.

కాగా ఎట్టకేలకు ఆ మధ్య రివోల్ట్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.దీంతో ఈ అమ్మడి ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది.మరి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అలాగే ఈ అమ్మడికి సినిమా అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube