గుండె జ‌బ్బుల‌ను అడ్డుకునే జొన్న‌ రొట్టెలు..ఆ బెనిఫిట్స్ కూడా?

ప్ర‌తి సంవ‌త్స‌రం గుండె జ‌బ్బుల‌తో ఎంద‌రో మంది ప్రాణాలు విడుస్తున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, శ‌రీరానికి త‌గిన శ్ర‌మ లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి, ర‌క్త పోటు స్థాయిలు అదుపులో ఉండ‌క‌పోవ‌డం, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గుండె జ‌బ్బులు ఎటాక్ చేస్తుంటాయి.

 Sorghum Roti Helps To Reduce Heart Problems! Sorghum Roti, Benefits Of Sorghum R-TeluguStop.com

అయితే కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం ద్వారా గుండె జబ్బులు వచ్చే ముప్పును త‌గ్గించుకోవ‌చ్చు.అలాంటి ఆహారాల్లో జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి.

జొన్న పిండితో త‌యారు చేసే జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మేలైన పోషకాహారం అన‌డంలో సందేహం లేదు.ఎందుకంటే, ఈ జొన్న రొట్టెలు మంచి రుచి క‌లిగి ఉండ‌డంతో పాటు కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం, పాస్పరస్, మాంగనీస్, ఐర‌న్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే జొన్ని రొట్టెలు ఆరోగ్యానికి మేల‌ని నిపుణులు కూడా చెబుతుంటారు.

Telugu Bad Cholestrol, Benefitssorghum, Heart, Heart Problems, Jonna Rotte, Late

ముఖ్యంగా గుండె జ‌బ్బుల‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలో జొన్న రొట్టెలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయి నిజానికి శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలా కాకుండా అవ‌స‌రానికి మించి చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.వెంట‌నే గుండె జ‌బ్బులు దాడి చేస్తాయి.

అయితే జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల.వాటిలో ఉండే ఫైబర్ అద‌నంగా పెరిగిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించేస్తుంది.

అదే స‌మ‌యంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా ఉంటాయి.ఇక ఈ జొన్న రొట్టెల‌ను రోజుకు రెండు చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకున్నా.ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

ఇవి ఫాస్ట్‌గా డైజెస్ట్ అవ్వ‌డంతో పాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.మ‌రియు అధిక బ‌రువును అదుపులోకి తెస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube