ట్రెండీ టాక్‌ : 'బింబిసార' మరిన్ని కొత్త పోస్టర్స్ ఎందుకు?

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న బింబిసార మూవీ షూటింగ్‌ కార్యక్రమాలకు కరోనా అడ్డు వచ్చింది.అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు అప్‌ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

 Kalyan Ram New Film Bimbisara New Stills , Kalyan Ram, Bimbisara Movie Look, Tro-TeluguStop.com

ఇటీవల ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా బింబిసార పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది.చిన్న వీడియోను కళ్యాణ్‌ రామ్‌ నుండి వచ్చింది.

ఆ పోస్టర్ లో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవి ల మాదిరిగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.మగ ధీర సినిమా లో రామ్‌ చరణ్‌ కాస్ట్యూమ్స్ ను పోలి ఉండటంతో పాటు ఖైదీ నెం.150 సినిమా లో రౌడీ లను కుప్పగా పేర్చి దాని మీద కూర్చున్నట్లుగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి.బింబిసార ఇలా ఉంటాడు అంటే మేము చూడాలని అనుకోవడం లేదు అంటూ కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

దాంతో కళ్యాణ్‌ రామ్‌ నుండి కొత్త పోస్టర్స్‌ వస్తున్నాయి.
బింబిసార విమర్శలు తట్టుకోలేక వరుసగా రెండు మూడు పోస్టర్‌ లను కళ్యాణ్‌ రామ్ విడుదల చేశాడు.

ఎన్టీఆర్‌ జయంతి రోజున వచ్చిన పోస్టర్‌ లతో పోల్చితే కొత్త గా వచ్చిన పోస్టర్‌ లు చాలా బాగున్నాయి.కళ్యాణ్‌ రామ్‌ బింబిసార గా తప్పకుండా ఆకట్టుకుంటాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బింబిసార కు సంబంధించిన షూటింగ్‌ నిలిచి పోయిన నేపథ్యంలో సోషల్‌ మీడియా ట్రెండ్డీ ట్రోల్స్ ను తట్టుకోలేక మేకర్స్‌ ఇలా కొత్త పోస్టర్‌ లను విడుదల చేశారనే టాక్ వినిపిస్తుంది.నందమూరి ఫ్యామిలీ పౌరాణిక పాత్రలకు బాగా సూట్‌ అవుతారు.

అప్పటి ఎన్టీఆర్ నుండి బాలయ్య ఆ తర్వాత కొత్త ఎన్టీఆర్ వరకు ఎంతో మంది కూ డా పౌరాణికాలతో దుమ్ము రేపారు.మొదటి సారి కళ్యాణ్‌ రామ్‌ కూడా ఆ విధంగా ప్రయత్నించబోతున్నాడు.

మరి మనోడికి ఏ మేరకు సక్సెస్‌ దక్కేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube