తెలుగు మొదటి సూపర్ హీరో చిత్రం హనుమాన్... ప్రశాంత్ వర్మ న్యూ వెంచర్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తన ప్రతి ప్రాజెక్ట్ కి ఏదో ఒక కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు.అలాగే డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి కొత్త అనుభూతి అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

 Prasanth Varma Announced Hanuman Movie, Zombie Reddy, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

రెగ్యులర్ కథల మీద కుస్తీలు పట్టకుండా కొన్న జోనర్ కథలని కమర్షియల్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ తనని తాను మెరుగు పరుచుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో ఈ కుర్ర దర్శకుడు తన నాలుగో సినిమాని అఫీషియల్ గా ప్రకటించాడు.

హనుమంతుడు గురించి ఇప్పటికే మనం అందరం కథలు కథలుగా చదువుకున్నాం.అంజనిపుత్రుడు ఈ ప్రపంచంలో మొట్ట మొదటి సూపర్ హీరో అని చెప్పాలి.

రామాయణంలో అతని పాత్ర చిత్రణని చూస్తే హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరో సినిమాలు ఏవీ కూడా సరిపోవు.

అలాగే హనుమాన్ కార్టూన్ సీరియల్ చిన్నారులని విశేషంగా ఆకట్టుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సూపర్ హీరోల సినిమాలు వచ్చిన వాటికి స్ఫూర్తి మాత్రం కచ్చితంగా హనుమాన్ పాత్ర నుంచే అయ్యి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అలాంటి వరల్డ్ ఫస్ట్ సూపర్ హీరోని మరో సారి తెలుగు సిల్వర్ స్క్రీన్ పై ప్రశాంత్ వర్మ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఒక గ్రాఫిక్ విజువల్ తో హిమాలయాలని చూపిస్తూ హనుమాన్ టైటిల్ టీజర్ ని దర్శకుడు రిలీజ్ చేశాడు.ఇక ఈ మూవీని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ మూవీలో నేరుగా రియల్ హనుమాన్ పాత్రనే ప్రెజెంట్ చేస్తాడా లేదా హనుమతుది ఇనిస్పిరేషన్ ఒక ఫిక్షన్ క్యారెక్టర్ ని సృష్టించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube