2 డీజీ ధరను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..!

కరోనా బాధితులకు ఎమర్జెన్సీ టైం లో ఇచ్చే 2 డీజీ (2 డియాక్సీ-డి-గూకోజ్) ఔషధం డీ.ఆర్.

 Central Government Fix 2 Dg Price For Corona , 2 Dg, Central Government, Corona,-TeluguStop.com

డీ.ఓ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ఈ మెడిసిన్ ధరను ప్రకటించింది.ఒక్కో సాచెట్ ధరను 990 రూపాయలుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్టు ప్రకటనలో పేర్కొంది.అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ కు డిస్కౌంట్ కూడా అందిస్తోంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.కరోనా బాధితులకు ఆక్సీజన్ లెవల్స్ పడిపోయి ఇబ్బందుల్లో ఉంటే ఈ సాచెట్స్ ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుందని డీ.ఆర్.డీ.ఓ ప్రకటించింది.

2 డీజీ పౌడర్ ను నీతిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉంటుంది.అత్యవసర వినియోగం కింద ఈ మెడిసిన్ ను అనుమతి ఇచ్చింది భారత ఔషధ నియంత్రణ సంస్థ.ఈ నెల 17న మొదటి విడతగా 10 వేల 2 డీజీ సాచెట్లు రిలీజ్ చేశారు.

ఇక మరో 10 వేల సాచెట్లు త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలుస్తుంది.కరోనా సెకండ్ వేవ్ దేశం మొత్తాన్ని వణికిస్తుంది.ఇప్పటికే చాలా చోట్ల రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి.తెలంగాణాలో కూడా మే 12 నుండి లాక్ డౌన్ కొనసాగుతుంది.

మే 30 వరకు లాక్ డౌన్ ఉండగా 30న కేబినేట్ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపుపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube