2 న రాజీనామా... 6 న చేరిక ? మోదీ అమిత్ షాలతోనూ ఈటెల భేటీ ?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే,  అది ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం గురించే.ఆయనకు టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

 Etela Rajender Has Decided To Join Bjp On June 6,  Etela Rajendar, Ktr,telangana-TeluguStop.com

ఆయనను పార్టీ నుంచి సాగనంపేందుకు కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మంత్రివర్గం నుంచి రాజేందర్ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్ , రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన వేరే పార్టీలో చేరినా, సొంత పార్టీ పెట్టినా, పెద్దగా ప్రయోజనం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఆయన బిజెపిలో చేరబోతున్నారు అంటూ రెండు రోజులుగా హడావుడి నడుస్తోంది.

ఇప్పటికే బిజెపి జాతీయ నేతలు హైదరాబాద్ కు వచ్చి తమ పార్టీలో చేరితే ఏ పదవి ఇస్తామనే విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో జూన్ ఆరో తేదీన బిజెపిలో చేరాలని ఈటెల రాజేందర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా , జేపీ నాడ్డా వంటి వారు అపాయింట్మెంట్ లు కోరినట్లు తెలుస్తోంది.జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తన ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో రాజేందర్ ఉన్నారట.

బీజేపీ లో చేరిక విషయమై ఇప్పటికే తన సన్నిహితులైన వారు అందరితోనూ రాజేందర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Amithsha, Central, Etela Rajendar, Etela Rajender, Hujurabad, Ko Nadda, N

ఈ సందర్భంగా దాదాపు అందరూ బిజెపిలకి వెళ్లడాన్ని స్వాగతించడం తో పాటు , రాజేందర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పినట్లు సమాచారం.

రాజేందర్ బిజెపి లో చేరితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం తో పాటు కేంద్ర మంత్రి పదవి,  రాజేంద్ర భార్య కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ ఇప్పటికే అంగీకరించినట్లు , ఆ ఆఫర్ నచ్చడం తోనే సొంత పార్టీ నిర్ణయాన్ని విరమించుకుని బిజెపి వైపు రాజేందర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ టిఆర్ఎస్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

బిజెపి జాతీయ నేతలు అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత , ఢిల్లీకి వెళ్లి వారితో భేటీ అయ్యి అనంతరం పార్టీ మార్పు విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని రాజేందర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube