యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా మీసేవ పోర్టల్ ని హ్యక్ చేసిన ఘనుడు..!

చాలా మంది హీజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు.టెక్నాలజీని వాడుకుని దోపిడీలు, దొంగతనాలు చేసేస్తున్నారు.

 The Guy Who Hacked Your Service Portal By Watching Youtube Videos ..! Man Arrest-TeluguStop.com

కరోనా టైంలోొ దొంగతనాలు ఎక్కువగా జరగడం గమనార్హం.దేశంలో సైబర్​ నేరాల హవా పట్టాపగ్గాల్లేకుండా కొనసాగుతోంది.

కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్రల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైబర్​ దాడులు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల ఉద్ధృతి 5 రెట్లకు ఎగబాకిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ గతంలో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నిరంతర సమాచార మార్పిడితో ఎక్కడికక్కడ చోర బృందాల భరతం పట్టేలా చేయాలి.తాజాగా మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి పలు సేవల ద్వారా వచ్చే కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

అత‌డిని విచారించ‌గా దిమ్మ‌తిరిగే విష‌యాలు వెల్ల‌డించాడు.

వరంగల్​కి చెందిన కాసాని జగన్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో విలాసాలకు అవాటుపడి ఈజీ మ‌నీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.బైక్‌పై ఉన్న చలాన్లు కట్టడానికి మీ సేవ సెంటర్​కు వెళ్లినపుడు లాగిన్ వివరాలు తెలుసుకున్నాడు.

తన ఫ్రెండ్స్ నుంచి కొంత స‌మాచారం సేక‌రించి, యూట్యాబ్​లోని వీడియోల ద్వారా మీ సేవా పోర్టర్​లో లాగిన్ అయ్యాడు.ఈసీ లాంటి పలు కీలక డాక్యుమెంట్లు నుంచి వచ్చే కమీషన్​ను తన అకౌంట్ల‌కు మళ్లించుకున్నాడు.

తన ఐడీ ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న మీసేవా ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం టీమ్ రంగంలోకి దిగింది.ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.మన దేశంలో ఇటువంటి హ్యాంకింగ్ కేసులు చాలానే నమోదవుతున్నాయి.

కరోనా టైంలో ఇవి మరీ ఎక్కువయిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube