వీడియో వైరల్: తమ ట్రైనర్ పై సింహాల మెరుపు దాడి.. చివరకు..?!

సింహం ఒక కౄర జంతువు.సింహాన్ని మృగాలకు రాజుగా చెబుతారు.సింహాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోని మైదానాలలో నివసిస్తుంటాయి.5 నుంచి 10 సింహాలు గుంపుగా ఉంటాయి.సింహాల పొడవు సాధారణంగా పొడవు 5 నుంచి 8 అడుగులు ఉంటుంది.వాటి బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది.మగ సింహం జూలును కలిగి ఉంటుంది.సింహాన్ని మృగ రాజు అని కూడా పిలుస్తారు.

 Video Viral, Viral Video, Lioness, Attacksm , Circus, Trainer, Russian Circus,la-TeluguStop.com

సింహాలు రోజులో 20 గంటలు రెస్ట్ తీసుకుంటాయి.ఎక్కువగా రాత్రి పూట వేటాడుతుంటాయి.

జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలే వీటికి ఆహరం.ఎక్కువగా ఆడ సింహాలే వేటాడుతుంటాయి.

ఆసియా ఖండంలో సింహాలు అంతరించే దశకు చేరుకున్నాయి.

అయితే పూర్వం నుండి సింహాలను సర్కస్‌ లలో ఆడిస్తూ ఉండేవారు.సర్కస్ లో జంతువులు ఫన్నీ స్టంట్స్‌ చేయడం మనం చూస్తుంటాం.ఎక్కువగా కోతులను సర్కస్ లలో ఉపయోగిస్తుంటారు.

అక్కడక్కడ సింహం లాంటి క్రూర జంతువులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాటితో సర్కస్ నిర్వహిస్తూ ఉంటారు.వేటాడటం మాత్రమే తెలిసిన క్రూర జంతువులు సైకిల్‌ తొక్కడం, డ్యాన్స్‌ చేయడం లాంటివి చేస్తే మనం చూడకుండా ఉంటామా? ఎంజాయ్ చేస్తాం.కానీ ఒక్కోసారి ఆ జంతువులు మనుషులపై దాడి చేస్తే ఎలా? తాజాగా ఓ సర్కస్‌లో ఓ ఆడ సింహం సర్కస్‌ ట్రైనర్‌ పై దాడి చేసింది.ఈ ఘటనలో ఆ ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే. రష్యాలోని ఓ సర్కస్‌ లో మాక్సిం ఓర్లోస్‌ అనే ఓ ట్రైనర్ 2 సింహాలతో ఎంట్రీ ఇచ్చాడు.సింహాలను చూసి జనం పెద్దగా కేకలు వేశారు.దీంతో సింహాలు ఆ సర్కస్ ట్రైనర్‌ పైకి దాడికి ప్రయత్నించాయి.

ఆ ట్రైనర్‌ తన చేతిలోని కర్రలతో వాటిని భయపెట్టాడు.దీంతో అవి అతడికి దూరంగా వెళ్లాయి.

కొద్దిసేపటికి ఆడ సింహాం అతడిపై దాడికి దిగింది.కాళ్లు, చేతులు ఎక్కడ పడితే అక్కడ గాయాలు చేసింది.

ఎంతో కష్టపడి ఆ ట్రైనర్ సింహం బారి నుంచి తప్పించుకున్నాడు.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube