'వైరల్'గా మారిన ఒకప్పటి యాడ్.. అప్పట్లోనే ఇలాంటి?

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.కరోనా ప్రపంచ మొత్తాన్ని గడగడలాడించిది.

 Abhishek Bachchan 13year Old Idea Ad Goes Viral In Social Media, Abhishek Bachch-TeluguStop.com

అంతేకాకుండా ప్రతి విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.సామాజిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివి ఇలా ప్రతి ఒక్కటి నేర్పించింది.

అంతేకాకుండా అన్ని రంగాలు మూతపడగా పాఠశాలలు మాత్రం గత ఏడాది నుండి మూతపడ్డాయి.

ఇక విద్యార్థులకు తమ చదువుల విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటి దగ్గర నుండే ఆన్ లైన్ తరగతులు వింటున్నారు.

ఇవన్నీ జరుగుతాయని ఇది వరకు ఎవరు ఊహించకపోవచ్చు.కానీ ఇలాంటివి ఇదివరకే టీవీ యాడ్స్ ద్వారా, సినిమాల ద్వారా ముందే చూపించారు దర్శకులు.

ప్రస్తుతం జరుగుతున్న ఘట్టాలన్ని హీరో సూర్య నటించిన సినిమాలో ఇదివరకే చూశాము.అంతేకాకుండా శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమాల్లో కూడా ప్రతిసారి శానిటైజర్ చేసుకుంటూ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులో ఎదుర్కొంటున్న కొన్ని అడ్డంకులు ఒకప్పటి యాడ్ లో చూసాం.ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

13 ఏళ్ల కింద బాలీవుడ్ నటుడు అభిషేక్ ఓ యాడ్ లో చేశాడు.అందులో టీచర్ పాత్రలో కనిపించగా.ఓ పల్లెటూరి పేద అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ దొరక్క వెనక్కి వెళ్లి పోతుంది.ఇక ఆ తర్వాత అమ్మాయి తన ఊర్లోనే ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ తరగతులు వింటుంది.ఒక అమ్మాయి అలా చదువుకొని బెస్ట్ స్టూడెంట్ గా అవార్డు కూడా తీసుకోవడం ఈ ప్రకటన ద్వారా చూసాం.

ఇది కేవలం ఐడియా ఇంటర్నెట్ కోసం చూపించిన యాడ్.ప్రస్తుతం విద్యార్థులు కూడా కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్లో పాటలు వింటున్నారు.

చూశారుగా ఒకప్పుడు రీల్ గా చూపించినవన్నీ ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం.ప్రస్తుతం ఈ యాడ్ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube