సోనూసూద్‌ కు డబ్బులు ఎలా వస్తే నీకేంట్రా బాబు?

మంచి ఎవరైనా చేస్తే అభినందించాలి లేదంటే తమ వంతు సహకారం అందించాలి అదీ చేతనవ్వకుంటే నోరు మూసుకుని ఉండాలి.అంతే తప్ప వాడు చేస్తున్న మంచి పని ఎందుకు చేస్తున్నాడు.

 Social Media Trolls On Real God Sonu Sood,latest News-TeluguStop.com

ఎలా చేస్తున్నాడు.అసలు మంచి పనిని మంచి ఉద్దేశ్యంతోనే చేస్తున్నాడా అనే విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు.

అతడు ఏ ఉద్దేశ్యంతో చేసినా ఎలా చేసినా కూడా మంచే చేస్తున్నాడు కదా.కనుక మంచి చేస్తున్నప్పుడు అవతలి వారిని పూర్తిగా వదిలేయాలి.కాని సోనూసూద్‌ విషయం లో మాత్రం అలా జరగడం లేదు.సోనూ సూద్‌ మంచి చేస్తుంటే కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే కొందరు మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సోనూసూద్ గురించి సోషల్ మీడియా లో ఒక వర్గం వారు విమర్శలు చేసేందుకు రెగ్యులర్‌ గా కామెంట్స్ చేస్తున్నారు.సోనూసూద్ సినిమా ల్లో ఎక్కువ ఆఫర్లు రావడం కోసం ఈ పనులు చేస్తున్నాడు అంటూ కొందరు.

మరి కొందరు మాత్రం రాజకీయంగా సోనూసూద్‌ ఏదో ప్రయత్నం చేయబోతున్నాడు.అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటున్నారు.

ఇక మరి కొందరు నీచంగా అతడు విరాళాలు సేకరించేందుకు ఈ పనులు చేస్తున్నాడు.ఆ విరాళాల్లో ఎంత వరకు వినియో గిస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇంకొందరు నీకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటూ సోనూసూద్‌ నే ప్రశ్నిస్తున్నారు.అసలు డబ్బు ఎక్కడి నుండి వస్తే ఏంటీ.

ఎంత ఖర్చు చేస్తే మీకు ఏంట్రీ.అతడు చేసే మంచి పని మీకు ఇష్టం ఉందా లేదా.

మీ వల్ల మంచి చేయాలనుకున్న వారికి కూడా నిరాశ కలిగించేలా ఉంది.సాయం చేయకున్నా పర్వాలేదు కాని నోరు మూసుకుని ఉండడ్రా బాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube