వెంకటేశ్వర స్వామికి పెద్ద అన్నయ్యగా ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.

 Unknown Facts About Oppilippian Temple, Lord Sri Vishnu,venkateswara Swamy, Tami-TeluguStop.com

కోరిన కోరికలు తీర్చే భక్తుల కొంగు బంగారం చేస్తున్నటువంటి ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అన్నయ్యగా ఒక దేవుడు కొలువై ఉండటమే కాకుండా, ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది.ఇంతకీ వెంకటేశ్వర స్వామి అన్నగా కొలువబడే ఆ దేవుడు ఎవరు? ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఏదైనా ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యం సమర్పించడం మనం చూస్తుంటాం.అదే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచి పెడుతుంటారు.అయితే రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉప్పిలియప్పన్ దేవాలయం ఉన్నది.ఈ దేవాలయం 108 వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయంలో భూదేవి లేకుండా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు కదిలించరు.ఈ ప్రాంతంలో భూదేవి మార్కండేయుడికి తులసివనంలో కనిపించడం వల్ల ఈ క్షేత్రాన్ని తులసి వనం అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం మార్కండేయుడు ఉప్పును విసర్జించి కేవలం పండ్లు, కాయలు మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేసేవారు.ఈ క్రమంలోనే మార్కండేయుడికి భూదేవి కనిపించడంతో తనని పెంచి పెద్ద చేశారు.

ఆ బాలిక వయస్సు రాగానే తనకు తగ్గ మంచి వరుడిని వెతికి వివాహం చేయాలని మార్కండేయుడు భావించగా అప్పుడు మార్కండేయుడు ఆశ్రమానికి ఒక వృద్ధుడు వచ్చి ఆ బాలికను వివాహం చేసుకుంటానని అడుగుతాడు.అందుకు మార్కండేయుడు తన కుమార్తెకి వంట చేయడం రాదని, ఉప్పు వాడటం అసలు తెలియదని ఆ వృధ్దినితో  చెబుతాడు.

అందుకు సరే అన్న వృద్ధుడు భూ దేవిని వివాహం చేసుకోవాలని నిశ్చయించాడు.ఆ వృద్ధుడు రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నిజ రూపంతో ప్రత్యక్షం కావడం వల్ల మార్కెండేయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సాక్షాత్తు విష్ణుమూర్తితో వివాహం జరిపిన అనంతరం మార్కండేయుడు విష్ణువు పేరుతో అక్కడే వర్ధిల్లాలని కోరగా అందుకు విష్ణుమూర్తి ఉపాల్పియప్పన్ అంటే “ఉప్పు ఇల్లే అప్పన్” అని స్వామి భక్తుల పూజలందుకొనుచున్నాడు.అప్పటినుంచి ఇప్పటివరకు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ఉప్పు ఉండదు.ఇక్కడ వెలసిన స్వామివారిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెద్ద అన్నగా భావిస్తారు.తిరుపతి వెళ్ళలేని భక్తులు ఈ ఆలయానికి వెళ్లి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కులను కూడా ఇక్కడ చెల్లించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube