ఆ వార్తలన్ని అవాస్తవం: చంద్రమోహన్

చంద్ర‌మోహన్ అంటే ఇప్ప‌టి త‌రానికి ఒక న‌టుడిగానే తెలుసు.కానీ ఒక‌ప్పుడు ఆయ‌న పెద్ద హీరోల‌కు ధీటుగా హీరోగా న‌టించారు.

 All That News Is Untrue Chandramohan Chandra Mohan, Rumers, Check, Social Meida,-TeluguStop.com

ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో న‌టించారు.ఒక పాత్ర‌కు ప‌రిమితం కాకుండా ఎన్నో ర‌కాల పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

హీరోగా అవ‌కాశాలు త‌గ్గాక క‌మెడియ‌న్ గా, సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు.

ప్ర‌స్తుతం కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

దాదాపు 55 సంవత్సరాల పాటు నిర్విరామంగా నటిస్తూనే ఉన్నారు.మే 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఈ విలక్ష‌ణ న‌టుడి గురించి అనేక విష‌యాల‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా చంద్రమోహ‌న్ అనేక విష‌యాల‌ను పంచుకున్నారు.

అవేంటో ఇప్పుడు చూద్దాం.హీరోగా నటిస్తేకేవలం 50 సంవత్సరాలు వ‌య‌స్సు వ‌ర‌కు మాత్రమే ఇండస్ట్రీలో ఉండేవాడినని కానీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే.

ఆల్ రౌండర్ అనిపించుకోవాలని అందుకే అన్ని పాత్రలు చేయడం ప్రారంభించానని చంద్ర‌మోహ‌న్ వివ‌రించారు.

అన్ని పాత్ర‌ల్లో త‌న‌దైన స్టైల్‌లో న‌టిస్తూ నిర్విరామంగా 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశానని చంద్ర‌మోహ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తాను రాఖీ సినిమా చేస్తున్న సమయంలో బైపాస్ సర్జరీ జ‌రిగింద‌ని, అలాగే దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో ఆరోగ్య సమస్యలతో షూటింగ్ కూడా వాయిదా వేశానని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఆరోగ్యం కాస్త దెబ్బ‌తింద‌ని, అలాగే క‌రోనా ఉన్నందున సినిమాలు చేయట్లేద‌ని చెప్పారు.

కొద్ది రోజులుగా చంద్రమోహన్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి.అయితే అందులో వాస్త‌వం లేద‌ని సన్నిహితులు చెప్పారు.రూమ‌ర్లు సృష్టించేవాళ్లను దేవుడే శిక్షించాలి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇటీవల చంద్రమోహన్ మాట్లాడుతూ సినీ ప్ర‌పంచం త‌న‌కు ఎంతో ఇచ్చింద‌ని, మంచి పేరు తెచ్చ‌కున్న‌ట్టు మీడియాకు వివ‌రించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube