సర్కారు నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ లేనట్లే... కారణం అదేనంట

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు తన సినిమాలకి సంబంధించి ఏదో ఒక సర్ప్రైజ్ ని ఫాన్స్ కి అందిస్తూ ఉంటారు.ఈ సారి త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కలయికలో రాబోతున్న సినిమా గురించి కీలక అప్డేట్ ఉండే అవకాశం ఉంది.

 No Teaser Plan For Mahesh Sarkaru Vari Pata Movie, Super Star Mahesh Babu, Direc-TeluguStop.com

దాంతో పాటు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట నుంచి ఫాన్స్ కి టీజర్ రూపం లో సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కావడంతో కచ్చితంగా మూవీ నుంచి టీజర్ వస్తుందని ఫాన్స్ ఆశిస్తున్నారు.

అయితే ఈ మూవీలో మహేష్ బాబు కంప్లీట్ గా న్యూ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.ఇప్పటి వరకు సినిమా నుంచి అతని ఫస్ట్ లుక్ కూడా పరశురాం బయటకి రానివ్వలేదు.

అంత పకడ్బందీగా మూవీ షూటింగ్ చేస్తున్నారు.అయితే ఒకేసారి కృష్ణ పుట్టినరోజు నాడు సర్కారు వారి పాట నుంచి ఊహించని స్థాయిలో సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుందని భావించారు.

అయితే ఫాన్స్ కి మాత్రం చిత్ర యూనిట్ నుంచి నిరాశ తప్పేలా లేదనే టాక్ వినిపిస్తుంది.రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిన టీజర్ కి సరిపడా అవుట్ పుట్ సిద్ధం కాలేదని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో టీజర్ ప్లాన్ ని చిత్ర యూనిట్ విరమించుకున్నట్లు సమాచారం.అయితే ఫాన్స్ ని మరీ నిరాశకి గురి చేయకుండా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రం ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి కాంబోలో కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube