ఆ బాలీవుడ్ హీరోతో నటించాలని ఉందంటున్న సమంత...ఎవరంటే?

నటి సమంత తెలుగు వెండితెరకు పరిచయం అక్కరలేని పేరు.ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ ని తనవైపు తిప్పుకుంది.

 Samantha Who Wants To Act With That Bollywood Hero ... Who Is He Actress Samanth-TeluguStop.com

జెస్సీ పాత్ర తో తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించిన సమంత గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇక ఆ తరువాత బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలలో టాలీవుడ్ లో ఉన్న అందరి సూపర్ స్టార్ లను చుట్టేసింది సమంత.

అయితే ఇక ఆ తరువాత టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.అయితే నటిగా కొనసాగడమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది సమంత.

ప్రత్యూష ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మంది అనాధ చిన్నారులకు, నిరుపేదలకు అండగా నిలుస్తోంది సమంత.అయితే తాజాగా బాలీవుడ్ లో తన ఎంట్రీపై స్పందించిన సమంత రణబీర్ కపూర్ తో నటించాలని ఉందని, మంచి కథ దొరికితే నటించేందుకు సిద్ధం అంటూ సమంత వ్యాఖ్యానించింది.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఒకవేళ అన్నీ అనుకున్నట్టు కుదిరితే రణబీర్ తో కలసి నటించే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.మరి సమంత కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube