బీజేపీ కి ఇక కష్టమే... జనసేన కు లాభమే ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ ఏపీలో బాగా పడుతున్నట్లుగా కనిపించింది.నిత్యం పార్టీ శ్రేణులు అంతా యక్టివ్ గా ఉంటూ, ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే వారు.

 Bjp Troubled On Ap Politics Bjp,ap Bjp, Somu Veeraaju, Pavan Kalyan, Janasena, Y-TeluguStop.com

అలాగే బిజెపి సభ్యత్వాలపైనా దృష్టి పెట్టి పార్టీకి ఒకరకమైన ఊపు తీసుకువచ్చారు.ఇక ఏపీలో టిడిపి పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చిన సమయంలో బిజెపి ఆ స్థానం లోకి వెళ్తుందని, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అంతా భావించారు.

దీనికి తగ్గట్లుగానే రాజకీయాలు నడిచాయి.అయితే అదంతా కొంతకాలమే అన్నట్లుగా ఇప్పుడు బీజేపీ పరిస్థితి గతం కంటే దారుణంగా తయారైనట్లే కనిపిస్తోంది.

ఇప్పుడు పార్టీలో చేరే వారెవరు కనిపించడం లేదు.మొన్న పార్టీలోని నేతలు పక్కచూపులు చూస్తుండటం వంటి వ్యవహారాలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.అయితే బీజేపీ లోకి వలసలు తగ్గడానికి కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కారణం అనే వాదనలు లేకపోలేదు.

2019 ఎన్నికల తర్వాత బిజెపి కి ఊపు వచ్చినా, ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.దీనికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం, ధరల పెరుగుదల వంటి అంశాలు ఏపీ బీజేపీ కి ఇబ్బందికరంగా మారాయి.అయితే బీజేపీలో నెలకొన్న పరిణామాలు జనసేన పార్టీకి బాగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

టిడిపి, వైసిపి లకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న నాయకులంతా ఇప్పుడు బీజేపీ ని కాదని జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.బీజేపీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదని, అదే జనసేన అయితే పవన్ తో పాటు, కాపు సామాజికవర్గం అండదండలు ఉంటాయని ఎన్నో లెక్కలు వేసుకుంటున్న నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ చేరికలు రానున్న రోజుల్లో ఎక్కువ ఉండేలా కనిపిస్తున్నాయి.దీనంతటికీ బిజెపి బలహీనం కావడం కారణంగా కనిపిస్తోంది.

Telugu Ap Bjp, Jagan, Janasena, Pavan Kalyan, Somu Veeraaju, Ysrcp-Telugu Politi

అలాగే ఈ మధ్యకాలంలో టిడిపి బాగా బలం పెంచుకోవడం కూడా బిజెపికి ఇబ్బందికరంగా మారింది.అసలు కొద్దిరోజులుగా ఏపీ బిజెపి అధ్యక్షుడు ని మార్చుతారు అనే ప్రచారం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తర్వాత నుంచి పెద్ద ఎత్తున జరుగుతోంది.అలాగే చాలాకాలం నుంచి బీజేపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న జనసేన సైతం తమ పార్టీలో చేరికల విషయమై దృష్టి పెట్టింది.రాబోయే ఎన్నికల నాటికి పొత్తు విషయంలో ఆలోచించాలని, అవసరమైతే టిడిపితో కానీ లేక ఒంటరిగా పోటీ చేసి గెలిచి అధికారం చేపట్టే స్థాయిలో బలం పెంచుకోవాలనే ఆలోచనతో ఉండడంతో చేరికల విషయంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube