కరోనా కష్టకాలంలో ఔన్నత్యాన్ని చాటిన పరకాల పోలీసులు.. బాధితుల కోసం ఏం చేశారంటే.. ?

కరోనా సమయంలో ఎందరో ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు.చేతినిండా పనులు లేక.

 Parakala Police Arranges Free Transportation To Covid Victims,parakala, Police,-TeluguStop.com

చేసిన అప్పులు తీర్చలేక దుర్బరమైన పరిస్దితులను ఎదుర్కొంటున్నారు.ఇక ఇలాంటి కష్టాలను తీర్చడానికి అక్కడక్కడ దాతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

కానీ కరోనా అనే భయం వల్ల ఎదుటివారు చేసే సహయాన్ని నిరాకరిస్తున్న వారు కూడా ఉన్నారు.

నిజానికి మనుషులకు కఠినమైన పరీక్షను నిలిపింది ఈ వైరస్.

ఇకపోతే పోలీసులు అంటే కఠినాత్ములని అనుకుంటాం కానీ వారిలో కూడా మంచి మనస్సు ఉన్న వారు అక్కడక్కడ ఉన్నారు.అందులో పరకాల పోలీసుల గురించి చెప్పుకుంటే.

ప్రస్తుతం రవాణ పేదప్రజలకు భారంగా మారింది.ఈ నేపధ్యంలో పరకాల పోలీసులు దవాఖాన నుంచి కరోనా బాధితులను ఉచితంగా వారి ఇండ్లకు చేర్చేందుకు ఉచిత రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చారు.

దీనిని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ప్రారంభించారు.కాగా ఇంతటి విపత్కర పరిస్దితుల్లో పేదలకు అండగా నిలుస్తున్న స్థానిక పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube