నందిత శ్వేత మరో డిఫరెంట్ కంటెంట్ మూవీ... ఏకంగా నాలుగు బాషలలో

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నందిత శ్వేత.ఈ అమ్మడు మొదటి సినిమాలోనే దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

 Nanditha Swetha Leads In Jetty Movie, Tollywood, Kollywood, Hero Krishna, Fisher-TeluguStop.com

దీంతో థ్రిల్లర్ కాన్సెప్ట్ లకి నందిత కేరాఫ్ గా మారిపోయింది.దాంతో పాటు టాలీవుడ్ లో ఫిమేల్ సెంట్రిక్ కథలకి కూడా నందిత అడ్రెస్ అయిపొయింది.

ఇప్పటికే కోలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నందిత తెలుగులో విభిన్న కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది.రెగ్యులర్ కథలకి ఆమె దూరంగా ఉంటూ వస్తుంది.

చివరిగా నందిత అక్షర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో ఫిమేల్ సెంట్రిక్ గానే తెరకెక్కింది.

అయితే అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.ప్రస్తుతం తెలుగు, తమిళ్ బై లింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఐపీసీ 376 సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.

ఇది కూడా ఫిమేల్ సెంట్రిక్ కథాంశంతోనే తెరకెక్కింది.ఇదిలా ఉంటే తాజాగా నందిత స్వీత్ లీడ్ రోల్ లో మరో డిఫరెంట్ కంటెంట్ మూవీని ఎనౌన్స్ చేశారు.

జెట్టి టైటిల్ తో నాలుగు సౌత్ బాషలలో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతూ ఉండగా కృష్ణ అనే కొత్త కుర్రాడు హీరోగా చేస్తున్నాడు.

సముద్రం ఉద్ద్తున మత్స్యకార ప్రజల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది తెలుస్తుంది.మరి ఈమె కెరియర్ లో రాబోతున్న ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నందిత ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుతుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube