బైడెన్ కంటే.. కమలా హారిస్‌కే నాలుగు రాళ్లు ఎక్కువట, ఎంతో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత.

 Biden Kamala Harris Incomes Dropped In 2020 Tax Returns Show, Kamala Harris ,jo-TeluguStop.com

కనుసైగతో ఏ దేశాన్నైనా, ఎవరినైనా శాసించగల పవర్ ఆయన సొంతం.ప్రపంచ గమనాన్ని రెప్పపాటులో మార్చగల నిర్ణయాధికారం అగ్రరాజ్యాధినేత చేతుల్లో వుంటుంది.

అలాంటి పదవిలో వున్న వ్యక్తికి జీతభత్యాలు కూడా అదే స్థాయిలో వుంటుంది.అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ పదవుల్లో వున్న వారితో పాటు ప్రపంచంలోని ఆయా దేశాధినేతల వేతనాలు కూడా ఆయన దరిదాపుల్లోకి కూడా రావు.

అలాంటిది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సంపాదన ఎక్కువట.
వివరాల్లోకి వెళితే.బైడెన్, కమలా హారిస్‌లు 2020 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన‌ ఆదాయం, పన్ను ఇతర వివరాలను సోమవారం వెల్లడించారు.బైడెన్ ఆయ‌న స‌తీమ‌ణి, అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్ జంట‌గా త‌మ ట్యాక్స్ రిట‌ర్న్‌, ఆదాయం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌గా.ఉపాధ్య‌క్షురాలు కమలా హారీస్ త‌న భ‌ర్త, డగ్ ఎమ్హాఫ్‌లు సంయుక్తంగా త‌మ సంపద వివ‌రాలను తెలియ‌జేశారు.దీని ప్ర‌కారం అధ్య‌క్షుడి సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలి ఆదాయమే అధికమ‌ని తేలింది.2020లో కమలా హారిస్ ఆదాయం రూ.12.41కోట్లుగా ఉంటే.బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లు మాత్ర‌మే.

Telugu America, Bidenkamala, Doug Emhoff, Jill Biden, Joe Biden, Kamala Harris-T

2019లో 9.85లక్షల డాలర్లుగా(రూ.7.21కోట్లు) ఉన్న బైడెన్ ఆయన సతీమణి స్థూల ఆదాయం 2020లో 6.21లక్షల డాలర్లకు (సుమారు రూ.4.44కోట్లు) పడిపోయింది.వీరిద్దరూ 2020 ఏడాదికి గాను 1.57లక్షల డాలర్లు (రూ.1.15కోట్లు) ఆదాయ‌పు పన్ను చెల్లించారు.అలాగే ఉపాధ్యక్షరాలు కమలా, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్‌లకు సంబంధించి 2020లో వారి స్థూల ఆదాయం 16.95లక్షల డాలర్లు (సుమారు రూ.12.41కోట్లు).వీరు పన్ను రూపంలో 6.21 లక్షల డాలర్లు (రూ.4.55కోట్లు) చెల్లించారు.

Telugu America, Bidenkamala, Doug Emhoff, Jill Biden, Joe Biden, Kamala Harris-T

దీనితో పాటు త‌మ స్వ‌రాష్ట్రాల్లో చెల్లించిన ట్యాక్స్ వివ‌రాల‌ను సైతం అధ్యక్ష, ఉపాధ్యక్షులు బహిర్గతం చేశారు.కాలిఫోర్నియాలో క‌మ‌లా 1.25 ల‌క్ష‌ల డాల‌ర్లు ఆదాయపు ప‌న్ను చెల్లించ‌గా.ఆమె భర్త డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో 57 వేల డాల‌ర్ల ట్యాక్స్ చెల్లించారు.

ఇకపోతే అధ్య‌క్షుడు బైడెన్ దంప‌తుల విషయానికి వస్తే.డెలావేర్‌లో బైడెన్ 28,791 డాల‌ర్లు .వ‌ర్జీనియాలో జిల్ బైడెన్ 443 డాల‌ర్లు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించారు.2020లో బైడెన్ దంపతులు తమ ఆదాయం నుంచి 30,704 డాల‌ర్లు (రూ.22లక్షలు)ను స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల కోసం విరాళంగా ఇచ్చారు.కమలా దంపతులు సైతం 27వేల డాల‌ర్లు (సుమారు రూ.20లక్షలు) సేవా కార్యక్రమాలకు విరాళంగా అందజేశారు.

కాగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.

తొలి నల్లజాతి మహిళగా, తొలి ఆసియన్‌గా ఇలా అన్నింట్లో చరిత్ర లిఖించారు కమలా హారిస్.ఇప్పటికీ ప్రపంచ నలుమూలల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతూనే వున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube