ఆలయ శిఖరమే లేని హనుమాన్ ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా విమాన గోపురం ఉండటం చూసే ఉంటాము.కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చెట్టునే ఆలయ శిఖరం గా చేసుకొని ఆ చెట్టు పేరు మీదుగా భక్తులకు దర్శనమిస్తున్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది.

 Facts About Sri Maddi Anjaneya Swamy Temple, Sri Maddi Anjaneya Swamy Temple, Ja-TeluguStop.com

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్రకాలువను ఆనుకుని మద్దిచెట్టు తొర్రలో స్వయముగా ఆంజనేయస్వామి వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు.

పురాణాల ప్రకారం త్రేతాయుగం, ద్వాపర యుగంలోనూ మధ్వాసురుడనే రాక్షసుడు జన్మించాడు.

జన్మించినది రాక్షసులుగా అనే అయినా అతను మాత్రం కత్తి పట్టకుండా జీవహింస చేయకూడదని భావించి ఆ ఆంజనేయుడు పట్ల పరమ భక్తుడిగా వ్యవహరించేవాడు.ఎటువంటి యుద్ధాలు చేయకుండా ప్రతి ఒక్కరికి హితబోధ చేస్తూ ఆంజనేయుడిని కొలిచేవాడు.

ఈ క్రమంలోనే ద్వాపరయుగంలో ఒకరోజు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు.ఒకరోజు పక్కన ఉన్న కాల్వలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి, తినడానికి మామిడి పండు ఇచ్చింది.

ఈ విధంగా ప్రతి రోజు వానరం అతనికి సేవలు చేస్తుండేది.

ఈ క్రమంలోనే మద్యుడు నువ్వు ఎవరో నాకు తెలీదు, ప్రతిరోజు ఈ విధంగా నాకు సపర్యలు చేస్తున్నావు, నువ్వు ఎవరు అని అడగగా అప్పుడు ఆంజనేయుడు ప్రత్యక్షమవుతాడు.

దీనికి పులకించిన మద్యుడు స్వామీ నిన్ను ఒకే ఒక్కటి కోరతాను.దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు ఏ విషయము అడుగు అనగా.స్వామి నేను నిన్ను విడిచి ఉండలేను నేను ఎప్పుడు నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని అడగగా.అందుకు ఆంజనేయుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే నేను నీ కింద శిలారూపంలో వెలుస్తానని, నన్ను నీ పేరు మీదుగా ప్రజలు పూజిస్తారని తెలిపారు.

ఈ క్రమంలోనే కాలువ గట్టున మద్యుడు మద్దిచెట్టుగా మారగా, ఆంజనేయుడు ఆ చెట్టు కిందనే ఒక చేతిలో మామిడి పండు మరొక చేతిలో గద పట్టుకుని మద్ది ఆంజనేయస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.తరువాత ఈ ఆలయ నిర్మాణం చేపట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మద్దిచెట్టు ఆలయ శిఖరంగా ఏర్పడి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube