అనుష్క, సమంత, సాయిపల్లవిల రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

కెరీత్ తొలినాళ్లలో తక్కువ మొత్తం పారితోషికానికే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న తరువాత తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేస్తున్నారు.ఆయా హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.

 Star Heroines Anushka Saipallavi Samantha Remuneration Details , Anushka , Remun-TeluguStop.com

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మినహా మరే సినిమాలో నటించడం లేదనే సంగతి తెలిసిందే.

బంగార్రాజు సినిమాలో చైతన్యకు జోడీగా సమంత నటిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని గతేడాది సమంత ఆదాయం 11 మిలియన్ డాలర్స్ అని తెలుస్తోంది.సమంత సినిమాలతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు అనుష్క సినిమాను బట్టి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారు.

గతేడాది అనుష్క సంపాదన ఏకంగా 23 మిలియన్ డాలర్స్ అని తెలుస్తోంది.

అనుష్క తక్కువ సినిమాలు చేస్తున్నా ఆమె ఆదాయం మాత్రం ఎక్కువ మొత్తం ఉండటం గమనార్హం.ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో విజయాలు సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

Telugu Anushka, Saipallavi, Samantha-Movie

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి గతేడాది సంపాదన 3 మిలియన్ డాలర్స్ అని తెలుస్తోంది.ప్రస్తుతం సాయిపల్లవి ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.సాయిపల్లవి నటించిన విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి డీగ్లామరస్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube