స్విమ్ సూట్ లో అలా కనిపించి షాకిచ్చిన భూమిక.. ఏమైందంటే..?

సినిమా రంగంలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ​ఇండస్ట్రీ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి భూమిక మంచి పేరును తెచ్చుకున్నారు.పవన్ కళ్యాణ్ ఖుషీ, మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలలో భూమిక హీరోయిన్ కావడం గమనార్హం.

 Bhumika Swim Suit Photo Goes Viral In Social Media,latest Viral News-TeluguStop.com

స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు వెలుగు వెలిగిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన తరహా పాత్రలలో నటిస్తున్నారు.

అయితే భూమిక హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా నటించారు.

గ్లామరస్ రోల్స్ కు కూడా భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మరికొన్ని సంవత్సరాలు ఆమె నటిగా బిజీగా ఉండేవారని కామెంట్లు వినిపించాయి.భూమిక నిర్మాతగా కూడా మారి తకిటతకిట సినిమాతో అదృష్టం పరీక్షించుకోగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Telugu Bhumika, Swim Suit-Movie

తకిటతకిట సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో భూమిక సినిమా నిర్మాణానికి దూరమయ్యారు.అయితే తాజాగా భూమిక స్విమ్ సూట్ లో దర్శనమివ్వగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఒకవైపు సీనియర్ స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ జనరేషన్ హీరోలతో భూమిక ఆడిపాడారు.మరోవైపు భూమిక ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని ఆ వెబ్ సిరీస్ లో భూమిక బోల్డ్ రోల్ లో నటించనున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భూమిక హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.బ్లాక్ స్విమ్ సూట్ లో భూమిక స్విమ్ చేస్తుండగా ఆ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

భూమిక ఫోటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.వెబ్ సిరీస్ లో భూమిక బోల్డ్ రోల్ లో నటిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube