విక్టరీ వెంకటేష్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలివే..?

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో వెంకటేష్ నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ కాకపోయినా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా వెంకటేష్ పేరును సంపాదించుకున్నారు.

 Star Hero Victory  Venkatesh Rejected Movies List,latest Viral News-TeluguStop.com

అయితే వెంకటేష్ తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమా హిట్టైన సంగతి తెలిసిందే.

గోపీచంద్ మలినేని క్రాక్ కథను మొదట వెంకటేష్ కు చెప్పగా కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఈ సినిమాలో చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.కృష్ణవంశీ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ కు బాబాయ్ పాత్రలో వెంకటేష్ నటించాలి.

కానీ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండటంతో వెంకటేష్ ఆ పాత్రను రిజెక్ట్ చేశారు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో మొదట వెంకటేష్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

రానా ఈ సినిమాలో హీరోగా నటించారు.దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సంతోషం సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ మొదట వెంకటేష్ కు వచ్చింది.

వెంకటేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో నాగార్జున ఆ సినిమాలో నటించారు.శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాలో నటించే ఛాన్స్ వెంకటేష్ కు వచ్చింది.

అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారని సమాచారం.మణిరత్నం రోజా, మణిరత్నం ఘర్షణ సినిమాలలో కూడా నటించే ఛాన్స్ మొదట వెంకటేష్ కు రాగా కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఆ సినిమాలను రిజెక్ట్ చేశారు.

ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించే ఛాన్స్ మొదట వెంకటేష్ కు రాగా వెంకటేష్ ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ కథ శర్వానంద్ దగ్గరకు చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube