రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్..!!

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు తనని కొట్టినట్లు కాళ్ళకి ఉన్న గాయాలను నిన్న న్యాయమూర్తి ముందు.చూపించటం తెలిసిందే.

 Raghuram Krishna Raju Medical Report High Court, Raghuram Krishna Raju, Ap Cid,-TeluguStop.com

ఈ నేపథ్యంలో కోర్టు ఓ కమిటీని నియమించి రఘురామకృష్ణం రాజుకి గాయాలకి గల కారణం తెలియజేయాలని .వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ఈ క్రమంలో గుంటూరు జిజిహెచ్ హాస్పిటల్ లో రఘురామకృష్ణంరాజుకి  18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం తాజాగా హైకోర్టు కి మెడికల్ కమిటీ ఈ నివేదిక అందించింది.

రఘురామకృష్ణంరాజు కాలి కి సంబంధించి ఎటువంటి గాయాలు లేవని నివేదికలో పేర్కొంది.పరిస్థితులు ఇలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజుని వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.రమేష్ హాస్పిటల్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాది వాదనలు విని ఆ వివరాలు తో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.  ఇదిలా ఉంటే వైద్యపరీక్షల అనంతరం ఏపీ పోలీసులు రఘురామకృష్ణంరాజు ని గుంటూరు జిల్లా కర్మాగారం కి తరలించారు.

ఈ క్రమంలో హైకోర్టు ఆస్పత్రికి ఆయన తరలించాలని తెలపడంతో .ఏపీ రాజకీయలలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.  

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube