తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆ రాష్ట్ర మంత్రి.. హ్యట్సాఫ్ సార్..!

మానవత్వం అనేది స్దాయిని బట్టి ఉండేది కాదు.అలాగని స్వార్ధంతో సహాయం చేస్తే అది మానవత్వం అనిపించుకోదు.

 Karnataka Home Minister Basavaraju Bomai Has Converted His House Into A Covid Ca-TeluguStop.com

ముఖ్యంగా రాజకీయ నాయకులు దాదాపుగా సేవ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ లబ్ధిపొందాలని చూస్తారు.

ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే ఆ ఆలోచన వెనక ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం పొందాలనే ఆరాటం ఉంటుదని ఆలోచిస్తారు ప్రజలు.

అందులో ఈ కరోనా సమయంలో ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు తమ సొంత ఖర్చుతో ప్రజలకు సహాయం చేసినట్టుగా వినబడలేదు.ఏమన్న అంటే ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది.

ఈ పధకాన్నీ ప్రభుత్వం అమలు చేస్తుందని అంటారే గానీ, ఆ పధాకాలను పంది కొక్కుల్లా మేస్తున్న నేతలే ఎక్కువగా పొలిటికల్లో కనిపిస్తారు.

ఇకపోతే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ, ఇతర శాఖల మంత్రు గానీ ప్రజల కోసం ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే ఇలాంటి ముఖ్య మంత్రి మన రాష్ట్రానికి ఎందుకు లేడు అని బాధగా అనిపిస్తుంది.

చేతగానీ, చేవ లేని నేతల వల్ల ప్రజలకు ఒరిగేది ఏం ఉండదు.ఇకపోతే మొదటిసారి ఒక మంత్రి తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడం ఆశ్చర్యం కలిగించే విషయం.

అతనే కర్ణాటక హోంమంత్రి బసవరాజు బొమై కరోనా కాలంలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడటం చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.నిజంగా మీ సేవా దృక్పథానికి హ్యాట్సాఫ్ సార్ అని అనకుండా ఉండలేక పోతున్నారట ఈ విషయం తెలిసిన వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube