రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. పేదవాడి ఆకలి పై రాజకీయమా..!

కరోనా కేసులు నియంత్రించేందుకు తెలంగాణా రాష్ట్రంలో 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.లాక్ డౌన్ టైం లో ఎవరు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 Revanth Reddy Fires On Telangana Government, Congress Mp, Corona Lock Down,covid-TeluguStop.com

అయితే లాక్ డౌన్ టైం లో బయట తిరుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బేగం పేట లో పోలీసులు అడ్డుకున్నారు.అయితే రేవంత్ రెడ్డి దీనిపై తీవ్రంగా మండిపడ్డారు.

పేదలకు అన్నం పెట్టేందుకు వెళ్తుంటే తన వాహనాన్ని ఆపారని మండిపడ్డారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ హాస్పిటల్ వద్ద పేదలకు అన్నం కూడా పెట్టకూడదా అంటూ ఫైర్ అయ్యారు.

ఇది ప్రభుత్వ కుట్ర అని.పేదవాడి ఆకలిపై రాజకీయం ఏని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కంటోన్మెంట్ ఏరియాలో కోవిడ్ కేంద్రంగా మార్చిన ఓ హాస్పిటల్ వద్ద జరిగే పనులను తాను పర్యవేక్షించాల్సి ఉంది.అలాంటిది నన్ను ఆపడం అంటే గరీబోడి నోటి కాడ కూడు లాగేసే ప్రయత్నమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని అన్నారు రేవంత్ రెడ్డి.తానొక ఎంపీనని చూడకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదని.ఇది ముమ్మాటికి ప్రభుత్వ చర్యే అని అన్నారు రేవంత్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube