ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనున్న శ్రీముఖి.. లీక్ చేసిన కమెడియన్..?

ఈ మధ్య కాలంలో శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ముందు వరుస షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ షో తర్వాత మాత్రం తక్కువ సంఖ్యలో షోలు, ఈవెంట్లు చేస్తున్నారు.

 Tollywood Anchor Srimukhi Ready To Marry America Pop Singer, Anchor Srimukhi, Po-TeluguStop.com

శ్రీముఖికి ఆఫర్లు తగ్గాయో లేక శ్రీముఖి తక్కువ సంఖ్యలో షోలు, ఈవెంట్లు చేస్తున్నారో తెలియదు కానీ గతంతో పోలిస్తే శ్రీముఖి టీవీలలో ఎక్కువగా కనిపించడం లేదు.

యాంకర్లలో చాలామంది బుల్లితెరపై ప్రూవ్ చేసుకుని వెండితెరపై ఎంట్రీ ఇస్తే శ్రీముఖి మాత్రం సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బుల్లితెరకు పరిచయం అయ్యారు.

జులాయి, నేను శైలజ, జెంటిల్ మేన్ మరికొన్ని సినిమాలలో శ్రీముఖి నటించారు.అదుర్స్ షోతో యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో షోలను విజయవంతంగా హోస్ట్ చేశారు.

బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే అవకాశం ఉంది.జీ తెలుగు ఛానల్ 16 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆ ఛానెల్ ఒక ఈవెంట్ ను ప్రసారం చేస్తోంది.

అమెరికాకు చెందిన వ్యక్తితో శ్రీముఖికి పెళ్లి జరగబోతున్నట్టు ప్రోమోలో చూపించగా ఆ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.సద్దాం టీమ్ స్కిట్ చేయగా ఆ స్కిట్ లో అమెరికా పాప్ సింగర్ పేరుతో ఒక వ్యక్తిని తీసుకొస్తారు.

సద్దాం శ్రీముఖికి కమెడియన్ తో పెళ్లి జరిపించే ప్రయత్నం చేయగా స్కిట్ నవ్వులపువ్వులు పూయించింది.శ్రీముఖికి పాప్ సింగర్ తో పెళ్లైనట్టు చూపించి సద్దాం టీమ్ కడుపుబ్బా నవ్వించింది.

సింగర్ మధుప్రియ పాడిన పాటతో ఇతర కమెడియన్ల స్కిట్లు, డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube