తెలంగాణలో ' బ్లాక్ ఫంగస్ '...అలెర్ట్ గా ప్రభుత్వం ..!

కరోనా మహమ్మారి కారణంగానే ఎన్నో అనర్ధాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.రోజు రోజుకి ఈ వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో, దేశమంతా ఆందోళన ఉంది.

 Telangana Govt Issues Guidelines To Prevent Black Fungus, Black Fungus, Covid,-TeluguStop.com

అలాగే మరణాలు శాతం ఎక్కువగా ఉండటం మరింత కంగారు పుట్టిస్తోంది.ఒక రకం గా దేశమంతా యుద్ధం  చేస్తోంది.

ఈ మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ అనే వైరస్ పుట్టుకొచ్చింది.కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక తెలంగాణలోను ఈ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.ఒకపక్క తెలంగాణలో కొవిడ్ కేసులు ఒక కొలిక్కి రాకముందే, ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.


రోజురోజుకు ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ కు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వారిని ప్రత్యేక గదులు ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఈ వైరస్ లక్షణాలు అంటే ఎక్కువగా కళ్ళు, ముక్కు సమస్యలు ఉంటాయని ఆయన తెలిపారు.ఇక వీటికి చికిత్స అందించేందుకు ఈఎన్టి ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

  ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిని, కరోనా పేషెంట్లకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి కంటి సమస్యలు ఉంటే సరోజినీదేవి ఆసుపత్రి లో చికిత్స చేయిస్తున్నారు.


Telugu Blackfungas, Black Fungus, Covid, Gandhi Hospial, Gandhi, Sarojini, Telan

ఈ మేరకు గాంధీ ఆసుపత్రి, సరోజినీదేవి ఆసుపత్రి ల సూపరిండెంట్ లకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.అలాగే కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి లో బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కు అవసరమైన అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇక ఆదిలాబాద్ లో ఎక్కువగా ఈ కేసు కనిపిస్తున్నాయి.

అలాగే ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం లోని నేరేళ్ళ గ్రామంలోనూ ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.కరోనా తరహాలోనే ఈ బ్లాక్ ఫంగస్ కేసులకు ట్రీట్మెంట్ ఇస్తూ, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube