ప్రైవేటు ఆస్పత్రులకు షాకిస్తున్న గోవా ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. ?

రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే పేద ప్రజలకు వైద్యం, విద్య ఉచితంగా అందించడానికి ఒక్క క్షణం పట్టదన్న విషయం తెలిసిందే.కానీ ఇలా చేస్తే తమకేంటి లాభం అని ఆలోచించే దౌర్భాగ్యపు స్దితిలో మనదేశ రాజకీయాలు ఉన్నాయి.

 Goa Government Sensational Decision On Private Hospitals Giving Corona Treatment-TeluguStop.com

ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకేసుకున్న డబ్బులను బయటకు తీస్తే ఎందరో పేదలు బాగుపడేలా అభివృద్ధి పనులు చేయవచ్చు అనేది మేధావులు అభిప్రాయం.

ఇకపోతే ప్రస్తుతం కరోనా చిరుత పులిలా విచురుచుకు పడుతున్న నేపధ్యంలో గోవా ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు హెచ్చరికలతో సరిపెట్టుకున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం దేశం గర్వించే నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.

ఇంతకు ఏం చేసిందంటే ఈ రాష్ట్రంలో కరోనా చికిత్స చేస్తున్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులను తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

ఇక సోమవారం నుండి కరోనాకు చికిత్స అందితున్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి.ఈ క్రమంలో ఇక్కడ కరోనాతో చికిత్స పొందుతున్న బాధితులందరికీ అయ్యే వైద్య ఖర్చులన్నీ ఇక నుండి ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

కాగా ఈ విషయంలో గోవా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కనువిప్పుగా మారాలి అనుకుంటున్నారట విషయం తెలుసుకున్న జనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube