బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందో వివరణ ఇచ్చిన డాక్టర్ గులేరియా.. !

ప్రస్తుతం దేశంలో ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్ని చూస్తుంటే ఇకనుండైన మానవుడు ప్రకృతిపట్ల బాధ్యతగా మెదులుకోవలసిన అవసరం ఉందని అర్ధం అవుతుంది.ఇప్పటికే అనావృష్టి, అతివృష్టి, అంటురోగాలు, భూకంపాలు వంటి మొదలైన ఊహించని ప్రమాదాలు భీభత్సంగా విరుచుకు పడుతున్నాయి.

 Dr Guleria Explains Why Black Fungus Occurs, Aiims Director, Dr Guleria, Black F-TeluguStop.com

అదీగాక కరోనా వచ్చి ప్రజల జీవితాలను ఇంకా కోలుకోకుండా చేసింది.

ఈ బాధలో బ్రతుకులు వెళ్లదీస్తుండగా కరోనా తోబుట్టువునంటూ బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది.

ఈ సెకండ్ వేవ్ లో దీని ప్రస్దానాన్ని మొదలెట్టింది.కాగా మ్యూకోర్ మైకాసిస్ అని పిలిచే ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని విషయాలను వెల్లడించారు.

కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ తీవ్రం కావడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా స్టెరాయిడ్లు వాడడమేనని, అవసరం లేకున్నా స్టెరాయిడ్లు ఎక్కువగా వినిగియోస్తుండడం దీని ఉద్ధృతికి దోహదపడుతోందని వివరించారు.కాబట్టి కరోనా చికిత్సలో స్టెరాయిడ్ల వాడకాన్ని నివారించాలని డాక్టర్ గులేరియా అభిప్రాయపడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube