కృష్ణంరాజు తల రాత మార్చేసిన 555 సిగరెట్ ప్యాకెట్..ఎలాగో తెలుసా.. ?

కృష్ణంరాజు.రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన లెజెండరీ స్టార్.ఆయన ఎన్నో సినిమాల్లో నటించి అశేష జనాదరణ పొందారు.ఆ రోజుల్లో ఆయనకు ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉండేది.తన నటనతో ప్రేక్షకులను ఎంతో అలరించే వారు.ఇప్పటికీ కృష్ణంరాజు సినిమాలు అంటే జనాలకు చాలా మక్కువ.

 Unknown Facts About Rebal Star Krishnam Raju, Krishnam Raju, Madhusudhanrao, Dun-TeluguStop.com

అయితే రెబల్ స్టార్ గా ఎదిగిన ఈ రాజావారి జీవితాన్ని మార్చింది 555 సిగరెట్ ప్యాక్.ఇంతకీ ఆ సిగరెట్ డబ్బాముచ్చటేందో ఇప్పుడు తెలుసుకుందాం.

డూండీ సమర్పణలో వి.మధుసూదనరావు డైరెక్షన్ లో వీరాభిమన్యు మూవీ తీశారు.అర్జునుడి చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది.ఇందులో అభిమన్యుడు పాత్ర కోసం ఓ కుర్రాడిని తీసుకోవాలి అనుకున్నారు.నర్తనశాల సహా పలు సినిమాల్లో అభిమన్యుడిగా నటించిన హరనాథ్ ను తీసుకోవాలని డూండీ చెప్పారు.కానీ కొత్త కుర్రాడిని పెడదామని మధుసూదన్ రావు చెప్పారు.

ఒకసారి చెన్నైలోని ఆంధ్ర క్లబ్ కి వెళ్ళిన డూండీ కి ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు కనిపించాడట.అతడు సినిమా వేషాల కోసమే ట్రై చేస్తున్నాడని తెలియడంతో.

మా సినిమాలో ఉంది రేపు రా అంటూ ఆ కుర్రాడి చేతిలో విజిటింగ్ కార్డు ఇచ్చారట.

Telugu Dundee, Krishnam Raju, Madhusudhanrao, Tollywood, Veerabhimanyu-Telugu St

దాంతో ఆ కుర్రాడు అనుకున్న సమయానికి చెప్పిన చోటికి వచ్చాడు.అక్కడికి డూండీ వచ్చారు.కానీ మధుసూదన్ రావు రాకపోవడంతో చేతిలో ఉన్న 555 సిగరెట్ ప్యాకెట్ తో అరగంటకోసారి బయటకు వెళ్లి స్మోక్ చేసి రావడం మొదలు పెట్టాడు ఆకుర్రాడు.

ఇక ఎంతకీ మధుసూదన్ రావు రాకపోయేసరికి, బయటికి వెళ్లి వద్దామని సిగరెట్ ప్యాకెట్ అక్కడే ఉంచి వచ్చాడు.ఈలోగా మధుసూదన్ రావు వచ్చి.ఇంతకూ ఈ సిగరెట్ ప్యాకెట్ ఎవరిది అని డూండీని అడిగార.ఆ కుర్రాడు నాదే అన్నాడు.

నాకు సిగరెట్ తాగే వాళ్ళంటే పడదు.నీకు వేషం లేదని చెప్పాడట.

ఆ కుర్రాడు మరెవరో కాదు.కృష్ణంరాజు.

రెండేళ్ళ తరువాత కృష్ణంరాజు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube