విషాదం : కరోనా తో టాలీవుడ్ దర్శకుడు మృతి ....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారినపడి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ప్రజలు మృతి చెందారు.

 Telugu Director Nandyala Ravi Passed Away Due To Corona, Corona Virus, Telugu D-TeluguStop.com

దీనికి తోడు ఈ మధ్యకరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

కాగా తాజాగా తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య మరియు అవికా గోర్ తదితరులు జంటగా నటించిన “లక్ష్మీ రావే మా ఇంటికి” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “నంద్యాల రవి” కరోనా వైరస్ సోకి మృతి చెందాడు.దీంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

గత వారం రోజులుగా దర్శకుడు నంద్యాల రవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు.ఈ విషయం తెలిసిన కొందరు టాలీవుడ్ నటీనటులు నంద్యాల రవి కుటుంబానికి చికిత్స కోసం ఆర్థికంగా సహాయం కూడా చేశారు.

అయినప్పటికీ నంద్యాల రవి మాత్రం కోలుకోలేకపోయాడు.దీంతో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు నంద్యాల రవి కుటుంబ సభ్యులకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ విపత్కర సమయంలో అనవసరంగా రోడ్లపై సంచరించని అలాగే మాస్కులు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నంద్యాల రవి లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రానికి దర్శకుడిగా పని చేశాడు.

అలాగే ఇటీవలే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే తదితర చిత్రాలకు రైటర్ గా కూడా పని చేసాడు.కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో సరైన హిట్టు లేకపోవడంతో దర్శకుడు నంద్యాల రవి గుర్తింపుకి నోచుకోలేక పోయాడు.

ఏదేమైనప్పటికీ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఓ దర్శకుడు ఇలా హఠాత్తుగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం చాలా విషాదకరమైన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube