భద్ర సినిమాని అందుకే ఎన్టీఆర్ రెజెక్ట్ చేసాడట.. కానీ రవితేజ ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను మరియు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన భద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటించగా, ప్రముఖ హీరో అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Bhadra Movie Story Rejected By Ntr For No Dates Available,  Ntr, Raviteja, Telug-TeluguStop.com

అయితే ఈ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీనుకి మొదటి చిత్రమే అయినప్పటికీ కథాంశం ఆకట్టుకునే విధంగా ఉండటంతో మంచి ఆరంభం లభించింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపుగా “50 కోట్ల రూపాయలకు” పైగా వసూళ్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది.

ఇటీవలే ఈ చిత్రం విడుదలై దాదాపుగా 16 సంవత్సరాలు పూర్తయింది.

దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో భద్ర చిత్ర కథను మొదట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వినిపించాడట.అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ఇతర చిత్ర షూటింగులతో బిజీగా ఉండటం వల్ల డేట్లు కుదరకపోవడం మరియు బోయపాటి శ్రీనుకి కూడా దర్శకుడిగా మొదటి చిత్రం కావడంతో ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదట.

ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఈ కథని వినిపించినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ కూడా రెజెక్ట్ చేశాడట.దీంతో చివరికి ఆ అవకాశం రవితేజని వరించగా ఇటు హీరోకి అటు దర్శకుడికి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో టాప్ సెలబ్రెటీలు రాణిస్తున్నారు.

కాగా ప్రస్తుతం బోయపాటి శ్రీను తెలుగులో “అఖండ” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో నందమూరి నటసింహం “బాలయ్య బాబు” హీరోగా నటిస్తుండగా కంచె మూవీ ఫేమ్ “ప్రగ్యా జైస్వాల్” హీరోయిన్ గా నటిస్తోంది.ఇక మాస్ మహారాజా రవితేజ విషయానికొస్తే ప్రస్తుతం “ఖిలాడి” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఆ మధ్య “క్రాక్” అనే చిత్రంలో హీరోగా నటించగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube