న్యూస్ రౌండప్  టాప్ - 20 

1.రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఏపీ హైకోర్టు రఘురామకృష్ణరాజు కోర్టు లో చుక్కెదురైంది.రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా.

3.మమతా బెనర్జీ ఇంట విషాదం

-Telugu Political News

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు బెనర్జీ  అషీం బెనర్జీ కరోనా తో శనివారం మృతి చెందారు.

4.బాధితులకు ఉచిత భోజనం : ప్రారంభించిన రేవంత్

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు.

5.అరేబియా తీరంలో ‘ తౌక్టే ‘ తుఫాన్

-Telugu Political News

లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం బలపడి శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు తుఫాను గా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ తుఫాను ప్రభావం ఐదు రాష్ట్రాల పై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

6.  ఈ నంబర్లకు కాల్ చేస్తే ఉచితంగా ఫుడ్ డెలివరీ

దిల్ షుక్ నగర్ శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం మొదలైంది.  కరోనా వైరస్ బారినపడి హోం ఇసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారు ఉచిత భోజనం కోసం 98480 50058 , 9441697966 నంబర్ల ను సంప్రదించాలి అని చెప్పారు.

7.ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం విడుదల

-Telugu Political News

తెలంగాణలోని ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు 48 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

8.అదిలాబాద్ ను హడలెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ను బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది.ఫంగస్ లక్షణాలతో నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ లో ఇద్దరు మృతి చెందారు.

అలాగే బోథ్ ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది.అనేక మంది కంటిచూపును కోల్పోతున్నారు.

9.సింగరేణిలో కరోనా

-Telugu Political News

సింగరేణిలో ఇప్పటివరకు 12, 308 మంది కార్మికులకు కరోనా సోకింది.అందులో 9,938 మంది పూర్తిగా కోలుకున్నారు.

10.విజయవాడలో వంద పడకల కొవిడ్ సెంటర్ ప్రారంభం

సుజనా ఫౌండేషన్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు.

11.రఘురామకృష్ణంరాజు అరెస్టు ను తప్పుపట్టిన అమరావతి రైతులు

-Telugu Political News

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసిన విధానాన్ని అమరావతి ప్రాంత రైతులు తప్పుపట్టారు.

12.తిరుమల సమాచారం

తిరుమల శ్రీవారి దర్శన లపై కరుణ ప్రభావం బాగా కనిపిస్తోంది గత నాలుగు రోజుల తో పోలిస్తే భక్తుల సంఖ్య బాగా తగ్గింది.శుక్రవారం స్వామివారిని 5108 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

13.ఇంటర్ పరీక్షల పై నిర్ణయం తీసుకోలేదు : సీబీ ఎస్ఈ

-Telugu Political News

12వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని  సీబీఎస్ఈ  తెలిపింది.

14.యూకే లో కరోనా కొత్త వేరియంట్

మహారాష్ట్రలో ప్రారంభమైనట్లు భావిస్తున్న బి 1.617.2 రకం కరోనా వైరస్  ప్రస్తుతం యూకే లో వేగంగా వ్యాపిస్తోంది.

15.అందుబాటులోకి మరో డ్రగ్

-Telugu Political News

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కరోనా కరోనా చికిత్సకోసం ఔషధాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే దీనిపేరు 2డి ఆక్సీ డి గ్లూకోజ్ .దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

16.ఢిల్లీ లో హోం డెలివరీ

హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ లను ఇంటి వద్దకే డెలివరీ చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది.

17.పశ్చిమబెంగాల్ లో లాక్  డౌన్

-Telugu Political News

కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా పశ్చిమబెంగాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తూ శనివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

18.భారత్ కు ఐదు కోట్ల డోస్ లు

ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నాటికి తాము తయారుచేసిన 50 మిలియన్ల డోస్ లను భారత్ కు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సముఖత వ్యక్తం చేసింది.

19.ఆన్లైన్ ఉగ్రవాదంపై పొరుకి అమెరికా మద్దతు

-Telugu Political News

ఆన్లైన్ ద్వారా పెరిగిపోతున్న హింసాత్మక అతివాదం నిరోధించే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దిగ్గజ టెక్ సంస్థలు వర్చువల్ గా ఒకే వేదికపైకి చేరాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,060

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,060.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube