ఎట్టకేలకు నీరా టాండన్‌కు న్యాయం చేసిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో కీలక పదవి..?

ఇండియన్ అమెరికన్‌ మహిళ నీరా టాండన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు న్యాయం చేశారు.అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.

 Indian-american Neera Tanden To Serve As Senior Adviser To Biden, Biden,  Nira T-TeluguStop.com

ఇందుకు సంబంధించి వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది .నీరా అనుభవం, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు సాయపడుతుందని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) వ్యవస్థాపకుడు జాన్ పొడెస్తా అన్నారు.దీనితో పాటు అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ సాధించే విజయాలను చూసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదుల సంఖ్యలో భారతీయులకు విజయవంతంగా పదవులు కట్టబెట్టిన జో బైడెన్‌కు ఒక్క నీరా టాండన్ విషయంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

భారత మూలాలున్న నీరాను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ నామినేట్ చేశారు.అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌, రిపబ్లిక్ నేతలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.

ఇవే ఆమె కొంప ముంచాయి.దీంతో నీరా నియామకాన్ని కేబినెట్‌ మంత్రులు, డెమొక్రాటిక్‌, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు.

గతంలో ఆమె చేసిన ‘పక్షపాత’ వ్యాఖ్యల విషయమై డెమొక్రాట్ సెనేటర్ జో మాంచిన్ .తాను నీరాకు మద్దతుగా ఓటు వేయబోనని తేల్చి చెప్పారు.మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్ నామినేషన్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాంచిన్ స్పష్టం చేశారు.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల నాయకులపై ఆమె గతంలో చేసిన దురుసు వ్యాఖ్యల చరిత్రను ఈ సందర్భంగా మాంచిన్ గుర్తు చేశారు.

ఈ ధోరణి ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నీరా టాండన్ పక్షపాత ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకు, బడ్జెట్ కార్యాలయం , డైరెక్టర్ పని సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో బడ్జెట్‌ చీఫ్‌గా ఆమె నియామకంపై మద్దతు కూడగట్టడంలో బైడెన్ కేబినెట్‌ విఫలమైంది.నీరా టాండన్‌ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్‌ వెనక్కి తగ్గారు.

గత్యంతరం లేని పరిస్దితుల్లో నీరా టాండన్‌ వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ (ఓఎంబీ) డైరెక్టర్‌ పదవికి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా మార్చిలో అధ్యక్షుడికి లేఖ రాశారు.తన నియామకాన్ని ధ్రువీకరించేందుకు అధ్యక్ష కార్యాలయం, భారతీయ సమాజం ఎంతో కష్టపడ్డారని.

కానీ పరిస్ధితులు మాత్రం తనకు అనుకూలంగా లేవని నీరా టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu America, Biden, Democratic, Nira Tandon, Republican, White-Telugu NRI

తన నామినేషన్‌ను విత్ డ్రా చేయాలని నీరా కోరడంతో తాను అంగీకరించానని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.ఆమె అనుభవం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యంపై తనకెంతో గౌరవం ఉందని, త్వరలోనే టాండన్ మరో కీలకమైన పదవిలోకి వస్తారని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం.

రెండు నెలలు తిరిగే సరికి నీరాకు కీలక బాధ్యతలు అప్పగించారు బైడెన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube