ఇక నుండి గూగుల్ సేవలకు డబ్బులు చెల్లించాల్సిందేనా..?!

మనలో దాదాపు ప్రతి ఒక్కరికి గూగుల్ అకౌంట్ ఉండనే ఉంటుంది.ఎవరికివారు వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్ లో ఉచితంగా స్టోర్ చేసుకుంటున్న సంగతి అందరికీ విధితమే.

 We Have To Pay For Getting Google Services Subscription Plans  , Google Services-TeluguStop.com

అయితే ఇప్పటివరకు ఈ ఈ ఫీచర్ ని గూగుల్ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇకపై ఆ పరిస్థితి కనిపించట్లేదు.

ఇక పై జూన్ 1 నుండి ప్రీమియం వర్షన్ కు మారి డబ్బు చెల్లించి మీ ఫోటోలు వీడియోలు కు సంబంధించిన ఉచిత బ్యాకప్ ను పొందాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు మనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు గూగుల్ సర్వర్ లో నిల్వ చేసేందుకు గూగుల్ డ్రైవ్ లో 15 జిబి స్టోరేజ్ లిమిట్ అనిపిస్తోంది.

ఇలా 15 జీబి స్టోరీస్ లిమిట్ లో స్టోర్ చేసుకున్న బ్యాక్ ఫైల్స్ ను మన కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.అయితే జూన్ 1 నుండి ఈ అవకాశం వరకు ఉండేలా కనపడట్లేదు.

ఎవరైనా ఈ సేవలు ఉపయోగించుకోవాలి అనుకుంటే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకొని అందుకు సంబంధించిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించి కూడా అనేక రకాల ప్లాన్లను అందుబాటులో తీసుకొని వచ్చింది గూగుల్.

Telugu Google, Google Drive, Pay Google-Latest News - Telugu

ఇందులో భాగంగా 100 జీబీ డేటా నుండి 30 టిబి క్లౌడ్ స్టోరేజ్ వరకు సబ్స్క్రిప్షన్ ఆప్షన్లను తీసుకరాబోతుంది.అయితే ఇందులో మనకు అదనపు బెనిఫిట్ లు లేకపోలేదు.ఇందులో భాగంగా గూగుల్ విధించబోతున్న చార్జీలు ఈ విధంగా ఉన్నాయి. 100 జీబీ సంబంధించి గూగుల్ ప్లాన్ తీసుకోవాలి అనుకునేవారు నెలకు రూ.149 చెల్లించాలి.అదే ఏడాది కాలానికైతే ధర రూ.1499 ఉంటుంది.ఇక 200 జీబీ ప్లాన్‌ విషయానికి వస్తే  నెలకు రూ.219, అలాగే సంవత్సర కాలానికి రూ.2199 ఖర్చు అవుతుంది.ఇక 2 టీబీ ప్లాన్ అయితే నెలకు రూ.749, ఇదే ప్లాన్ సంవత్సర కాలనికి రూ.7,500 ఖర్చు అవుతుంది.అయితే, గూగుల్ వన్ యాప్ ఉన్న ఐఓఎస్ యూజర్లకు మాత్రం మరింత చౌకగా లభించనున్నాయి.ఇందులో భాగంగా బేసిక్ ప్లాన్ 100 జీబీ రూ.130, సంవత్సర కాలానికి రూ.1300 లకు వస్తుంది.ఇక 200 జీబీ ప్లాన్ నెలకు 210, ఉండగా సంవత్సర కాలానికి  రూ.2100 చెల్లించాలి.ఇక 2 టీబీ ప్లాన్ నెలకు రూ.650, సంవత్సర కాలానికి రూ.6500 చెల్లించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube