జియా యూజర్స్ కి బంపర్ ఆఫర్..!

కరోనా టైంలో జియో తన వంతు సాయం చేస్తోంది.కరోనా రోగుల కోసం జియో సంస్థ ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

 Bumper Offer For Geo Users Jio Users, Bumper Offer, New Offers, Jio Customers, N-TeluguStop.com

కరోనా సోకి ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.రోగులకు ఆక్సిజన్ ముప్పును అధిగమించడానికి రిలయన్స్ తన వనరులను, ఆక్సిజన్ సిలండర్లను అందజేస్తోంది.

ఇకపోతే తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది.ట్రాయ్ విడుద‌ల చేసిన టెలికాం యూజ‌ర్ల గణంకాల ప్ర‌కారం.రిల‌య‌న్స్ జియో గ‌డిచిన ఫిబ్ర‌వ‌రి నెల‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 1.48 ల‌క్ష‌ల‌కుపైగా కొత్త‌చందాదారుల‌ను సంపాదించుకుంది.ఇక ఫిబ్ర‌వ‌రి నాటికి జియో యూజ‌ర్ల సంఖ్య ఏకంగా 3.16 కోట్ల‌కు చేరింది.దీంతో 40 శాతం మార్కెట్ వాటాతో జియో మొద‌టి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.ఇక డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ జియో అగ్ర‌స్థానంలో నిలిచింది.సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది.

కరోనా టైంలో జియో రెండు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. రీచార్జ్ చేసుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ అంటే రోజుకు 10 నిమిషాలకు రిలయన్స్ ఫౌండేషన్ మాట్లాడుకునే వీలును కల్పించింది.

మరో ఆఫర్ ను కూడా జియో ప్రకటించింది.జియో తమ వినియోగదారుల కోసం ప్రతి జియో ఫోన్ ప్లాన్ తో వారు ఎంత రీఛార్జ్ చేసుకున్నారో అంతే విలువ గల అదనపు రీచార్జ్ ప్లాన్ ను ఉచితంగా అందించనుంది.అంటే ఒక జియో ఫోన్ యూజర్ రూ.75 ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్నట్లైతే ఆ రీఛార్జ్ కార్డుకు అంతే విలువ గల అదనంగా రూ.75 ప్లాన్ ను ఉచితంగా ఇస్తోంది.కరోనా టైంలో తమ వినియోగదారులకు కొంత మేర సాయం చేస్తూ మరిన్ని కార్యక్రమాలను చేయడానికి సిద్దమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube