మానవత్వం చూపించిన కరోనా.. 25 రోజుల పసికందును మృత్యువు నుండి తప్పించింది.. !

కరోనా వల్ల ప్రజల జీవితాలు భారంగా సాగుతున్నాయి.ఆనందాలన్ని ఆవిరైపోగా కరోనా చిమ్ముతున్న కాలకూట విష తుంపరల వల్ల కకావికలం అవుతున్న బ్రతుకులను చూస్తూ సామాన్యులు రోదించడం తప్ప ఏం చేయలేని దుస్దితిని అనుభవిస్తున్నారు.

 25day Old Baby Rescued From Covid, Odisha, Bhubaneswar, Private Hospital, Corona-TeluguStop.com

ఈ సమయంలో పేగు బంధాలు కూడా బరువైయ్యాయి.మూడుముళ్లతో ఏడడుగులు నడకతో ఏర్పడిన భార్యభర్తల సంబంధాలు కూడా కరోనా చిమ్ముతున్న హాలహలంలో కొట్టుకుపోతున్నాయి.కరోనా అంటే ఒక కర్కషమైన వైరస్.జాలీ, దయ, మానవత్వం లేని బండారాయి.

కన్నీళ్లకు కరగదు.ఆర్తనాదాలకు అణువంతైన చలించదు.

ముసలి ముతక, పిల్లా జల్లా, యువతీ, యువకులు అనే తేడా లేకుండా కఠినంగా తన కాటుకు బలిచేస్తుంది.కానీ ఒక్క మంచిపని చేసింది.25 రోజుల పసికందును ఈ వైరస్ మృత్యు ఒడిలోకి చేరకుండా రక్షించింది.

ఒడిశాలోని కలహండి జిల్లా మదనపూర్ రాంపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చిన ఈ మహిళతో పాటుగా వారి కుటుంబం అంతా కరోనాబారిన పడినారట.అందులో 5 రోజుల ఈ పసికందు కూడా ఉంది.

భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఈ శిశువుకు 20 రోజుల పాటు ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించడంతో కరోనాను జయించిందని ఇక్కడి వైద్యులు తెలిపారు.నిజానికి ఇదొక అద్భుతమైన ఘటనగా పేర్కొనవచ్చూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube